TPT: రేణిగుంట మేజర్ పంచాయతీలో జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవక ప్రైవేట్ ఫంక్షన్ల వద్ద చిన్నపాటి పనులు చేస్తూ అక్కడే అన్నం తింటున్నామని వాపోతున్నారు. జీతం వస్తేనే కుటుంబాలు నడుస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ధర్నాలు నిర్వహించినా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు.
W.G: సాగునీటి ఎద్దడి లేకుండా, ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికీ నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ సీహెచ్ వెంకట్ నారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఎల్.బి.చర్లలో రైతులతో కలిసి కాలువలు, పంట పొలాలను ఆయన పరిశీలించారు. సాగునీటి వృధాను అరికట్టేందుకు, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కాలువల పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని తెలిపారు.
KDP: బ్రహ్మంగారి మఠంలో నిర్వహించే స్వామివారి మాస కళ్యాణానికి మిర్యాలగూడకు చెందిన రామాచారి దంపతులు శుక్రవారం రూ.1,00,116 అందజేశారు. నూతన పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారి ఆదేశాలతో మఠం మేనేజర్ ఈశ్వర చారి వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతినెల శుద్ధ ద్వాదశి రోజున స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డ్‌లో గల మక్కా మసీదుకు స్థానిక మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు యాదవ్ శుక్రవారం ఏసీని బహూకరించారు. ముస్లిం సోదరులు చేసిన విజ్ఞప్తి మేరకు వారు వెంటనే స్పందించి ఈవితరణకు పూనుకున్నారు. కార్యక్రమంలో వనమా వెంకటేశ్వర్లు, నిస్సార్, ఇబ్రహీం, ఫరీద్, సమీర్, జమీల్ అబ్దుల్, జానీ, జావిద్, పాష పాల్గొన్నారు.
PDPL: 2026- 27 విద్యా సంవత్సరం మోడల్ స్కూల్లో ప్రవేశాలకు రేపే చివరి తేదీ అని ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లు, 7 నుంచి 10 తరగతులకు మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఆన్‌లైన్ చేయడానికి సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హమాలీ కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ MPPS పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తనకు తెలియజేయాలని సూచించారు.
VSP: మడుగులకి చెందిన 43 ఏళ్ల పురుషుడు కేజీహెచ్ జనరల్ సర్జరీ S3 యూనిట్‌లో ప్రొఫెసర్ డా. బెండి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో చేరాడు. పరీక్షల అనంతరం పెరియాంపుల్లరీ కార్సినోమా కారణమైన ఆబ్స్ట్రక్టివ్ జాండిస్‌గా నిర్ధారణైంది. ఆరోగ్యశ్రీ కింద సుమారు 5 గంటల పాటు విపుల్ (Whipple’s) శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
AP: రాయలసీమలో హార్టికల్చర్‌ను ప్రోత్సహిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘దేశంలో ఎక్కువ పండ్ల సాగు జరిగేది APలోనే. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలను విస్తరిస్తాం. వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచుతున్నాం. రాష్ట్రంలో ఆక్వా సాగును మరింతగా ప్రోత్సహిస్తాం. ప్రపంచానికి ఏపీ ఆక్వా హబ్‌గా మారుతుంది. భూగర్భ జలాలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని TDP నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుత.. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు
CTR: గుడిపాల(M) చిత్తపారలో విధ్వంసం సృష్టిస్తున్న అడవి ఏనుగుల నియంత్రణకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం(M) ననియాల ఎలిఫెంట్ క్యాంపులోని శిక్షణ పొందిన ఏనుగు జయంత్ (55) సారథ్యంలో పలమనేరు ముసలిమడుగులో కర్ణాటక నుంచి వచ్చిన దేవా, అభిమన్యు, కృష్ణ ఏనుగులు ఆపరేషన్ గజలో పాల్గొననున్నాయి.
అనంతపురం: గుంతకల్లు మండలం నాగసముద్రం విద్యుత్ డీపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుర్రాబ్బడు టర్నింగ్ సమీపంలోని రైతు నాగేంద్ర (సర్వే నెం: 449-A)కు చెందిన రెండు ఎకరాల చిని తోటలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 చెట్లు కాలిపోగా, రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు.
NDL: బనగానపల్లె మండలం గోవింద్ దీన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు ఇవాళ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. బ్రహ్మానంద ఆచారి పాఠశాలలోని విద్యార్థులకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఆయన అన్నారు. చెట్లపై ఆయన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
AKP: పరవాడ, లంకెలపాలెం మీదుగా బొగ్గు లారీల రవాణాను నిలిపివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడ జంక్షన్‌లో ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. బొగ్గు లోడుతో రాకపోకలు సాగించే లారీలు నుంచి బొగ్గు రోడ్లపై పడుతుండడంతో ప్రజలు పలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకోగా.. వీటికి రికార్డు స్థాయిలో స్పందన లభించింది. విజయ్ పోస్ట్‌కు 13 మిలియన్లు, రష్మిక పోస్ట్‌కు 15 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. మొత్తంగా 28 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో ఈ జంట సరికొత్త రికార్డు సృష్టించింది.
కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు శివారు లంకతోట గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు యాగాది క్రతువులు నిర్వహించి, నూతన దేవత విగ్రహాలు ప్రతిష్టించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ బంగారు బాబు, శివ పాల్గొన్నారు.