• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘MLA కోవ లక్ష్మిపై అక్రమ కేసును ఎత్తివేయాలి’

ASF: ఆసిపాబాద్ ఆదివాసి మహిళ MLA కోవ లక్ష్మిపై క్యతన్ పల్లి సంఘటనలో A12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ MLA పై కేసు బనాయించడం దారుణమన్నారు. తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:49 PM IST

శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును తనిఖీ చేసిన కమిషనర్

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్క్‌ను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసినట్టు వివరించారు.

February 25, 2026 / 12:47 PM IST

పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

MDK: మెదక్ పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల వివిధ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:47 PM IST

‘పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా మల్లయ్య బాధ్యతలు’

పెద్దపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నూగిల్ల మల్లయ్య బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

February 25, 2026 / 12:47 PM IST

‘తారకరామ ఎత్తిపోతలకు నిధులు విడుదల చేయాలి’

NTR: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన మైలవరం నియోజకవర్గానికి సాగునీటి వరప్రదాయిని తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెట్ట ప్రాంత రైతులందరూ ఈ పథకం పైనే ఆధారపడి పంటలను సాగుచేసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

February 25, 2026 / 12:45 PM IST

ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే

ASR: తిమ్మాపురం నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న ప్రాంతాన్ని CRZ-3 నుంచి CRZ-2కు మార్చాలని విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో కోరారు. CRZ-2కు మార్చకపోతే పర్యాటక అభివృద్ధి కష్టమవుతుందన్నారు. అలాగే 2014లో కేటాయించిన భూమిలో ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:45 PM IST

మృతురాలి కుటుంబానికి ఎంపీ ఆర్థిక సాయం

KDP: నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో మట్టి మిద్దె కూలి లక్ష్మిదేవమ్మ మృతికి నివాళులు అర్పించి, నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పంపిన రూ.10 వేల నగదును టీడీపీ నాయకులు బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:45 PM IST

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

VKB: యాలాల్ మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవానికి 108లో హాస్పిటల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్సును పక్కకాపి EMT నితిన్, పైలట్ మహేందర్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేశారు. భాగ్యలక్ష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

February 25, 2026 / 12:44 PM IST

పుంగనూరులో అంగన్వాడి కార్యకర్తలు నిరసన

CTR: తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరులోని ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద బైఠాయించి తమ నీరస తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:43 PM IST

పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

WNP: జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:43 PM IST

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ రాజర్షి షా

ADB: ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, గదుల్లో సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించారు.

February 25, 2026 / 12:43 PM IST

HPCLలో భారీగా ఉద్యోగాలు

ప్రముఖ ప్రభుత్వ సంస్థ HPCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్ స్ట్రీమ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.hindustanpetroleum.comను సంప్రదించండి.

February 25, 2026 / 12:42 PM IST

‘జనసేన సభ్యత్వం విజయవంత చేయాలి’

 ప్రకాశం: రేపటి నుంచి 12 రోజులపాటు జరిగే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రగొండపాలెం జనసేన నాయకుడు పాకనాటి పృథ్వీరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు అండగా ఉండడమే పవన్ ఆశయమని, సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రమాద బీమా రక్షణగా ఉంటుందన్నారు.

February 25, 2026 / 12:42 PM IST

ఒక్క గైర్హాజరు లేకుండా ఇంటర్ పరీక్షలు పూర్తి

JN: కొడకండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు కాగా, అందరూ హాజరయ్యారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాలేదు. పరీక్షా కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పాటు అవసరమైన సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు.

February 25, 2026 / 12:42 PM IST

BREAKING: హైకోర్టుకు బాంబు బెదిరింపు

TG: రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నాంపల్లి సీబీఐ కోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల వరుసగా వస్తున్న ఈ నకిలీ బాంబు బెదిరింపులు న్యాయవాదులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

February 25, 2026 / 12:38 PM IST