• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరణ

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై, నూతన పాలకవర్గాన్ని వారి కుర్చీలలో కూర్చోబెట్టి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

February 20, 2026 / 08:59 PM IST

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకంబాడి రోడ్డు సుబ్బారెడ్డి నగర్‌లోని వెంకీ జిమ్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు రుయా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న దీప్తి చరిష్మా (39)గా గుర్తించారు. ఆమె కరకంబాడి నుంచి విధులకు స్కూటీపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 08:59 PM IST

పోలీస్ క్రీడల్లో కమాన్పూర్ కానిస్టేబుల్ ప్రతిభ

PDPL: కమాన్పూర్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మట్ట రమేష్ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ చాటారు. సైబరాబాద్ కమిషనరేట్లో జరుగుతున్న 4వ తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ అర్చరీ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్, టీం విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆయన విజయంపై ఎస్సై కొట్టే ప్రసాద్, ఏఎస్సై బాలాజీ నాయక్ అభినందించారు.

February 20, 2026 / 08:59 PM IST

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత..

ASF: రెబ్బెన మండలంలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నంబాల నుంచి తక్కలపల్లికి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టుకున్నారు. ఎస్సై వెంకట కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.

February 20, 2026 / 08:55 PM IST

నెల్లిమర్ల MLA రేపటి షెడ్యూల్

VZM: నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి శనివారం ఉదయం 09:30 గంటలకు కొండవెలగాడ-నెల్లిమర్ల R&B రోడ్ రిసర్ఫేసింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు భోగాపురం మండలం, ముంజేరు గ్రామం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

February 20, 2026 / 08:55 PM IST

అక్రిడిటేషన్ కార్డులు.. UPDATE

TG: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని DPROలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ CH ప్రియాంక ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రిలాన్స్, వెటరన్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల నమోదు, దరఖాస్తుల పరిశీలన, రిపోర్టులు, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ మెంట్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:55 PM IST

YCP స్టేట్ పబ్లిసిటీ వింగ్స్ సెక్రటరీగా హేమచంద్ర

CTR: పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సి. హేమచంద్రను పార్టీ స్టేట్ పబ్లిసిటీ వింగ్స్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకంపై హేమచంద్ర మాట్లాడుతూ.. పార్టీ ఆశయాలను, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, సూచనలతో ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కలసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.

February 20, 2026 / 08:52 PM IST

చిన్నారులపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి: వైద్యులు

KNR: చిన్నారుల ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని RBSK వైద్యులు డాక్టర్ సురేశ్ సూచించారు. గంగాధర(M) ఆచంపల్లిలో సర్పంచ్ ఆరె. తేజశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వైద్యులు చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బరువు తక్కువగా ఉన్న వారిని ఎన్ఆర్సీకి రిఫర్ చేశారు.

February 20, 2026 / 08:50 PM IST

క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుంది: MLA

JGL: క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస అన్నారు. మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో ఉమ్మడి మేడిపల్లి మండల క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం అలవడుతుందన్నారు.

February 20, 2026 / 08:50 PM IST

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలు ప్రారంభం

MDK: మెదక్ స్టేడియంలో సీఎం కప్-2025 సాఫ్ట్ బాల్ క్రీడలను అదనపు కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. 25 జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్ గంగాల తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాధికారి విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి శోభన్ బాబు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:50 PM IST

‘ప్రజా పాలనకు పట్టం కట్టిన పట్నం ప్రజలు’

వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ప్రజలు మరోసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు.

February 20, 2026 / 08:48 PM IST

ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం: పొన్నం

TG: రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆదరించారన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నారు.

February 20, 2026 / 08:48 PM IST

చెట్లను తనిఖీ చేసిన కామారెడ్డి డివిజన్ ఆఫీసర్

మెదక్ నుండి ఎల్లారెడ్డి నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బంజారా గ్రామం నుండి తాండూర్ గేటు వరకు ఉన్నటువంటి ఫారెస్టులో గల చెట్లను కామారెడ్డి ఫారెస్ట్ డివిజినల్ ఆఫీసర్ రామకృష్ణ తనిఖీ చేశారు. అలాగే తాండూర్ గేటు సమీపంలో గల ఫారెస్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో గల 11వేల ఒక్క వంద సుమారు మొక్కలను పరిశీలించారు.

February 20, 2026 / 08:48 PM IST

BREAKING: ట్రంప్‌నకు భారీ షాక్

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను.. తిరిగి చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

February 20, 2026 / 08:47 PM IST

బీసీ సింహ గర్జనను జయప్రదం చేయాలని పిలుపు

కృష్ణా: మచిలీపట్నంలో బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ కోనా నాగార్జున శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సింహ గర్జన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 08:46 PM IST