అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంతో పోలిస్తే 0.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది. అలాగే జులై-సెప్టెంబర్ త్రైమానికానికి వృద్ధి రేటును 8.2 శాతం నుంచి 8.4 శాతానికి పెంచింది.
ప్రకాశం: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శుక్రవారం కనిగిరిలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు.
NLG: హైదరాబాద్‌లోని మెడివిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనంపల్లి సర్పంచ్ రాంసింగ్ నాయక్ కుమార్తె గీతికను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శించారు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కంట్లో కత్తెర గుచ్చుకోవడంతో గీతికకు ఆపరేషన్ జరిగింది. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
MDK: రేగోడ్(మం) గజవాడలో విద్యుత్ షాక్ తగిలి కుమ్మరి వెంకయ్య(65) మృతి చెందారు. తన ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయారు. ఈ క్రమంలో తల వెనుక భాగానికి తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మేరకు ఎస్సై పోచయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
JN: జిల్లా కేంద్రంలో శిక్షణ పొందిన కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లను గౌడ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
TG: మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత.. చట్టపరిధిలో ఏదైనా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మావోయిస్టు దేవ్ జీ.. తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందన్నారు. రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరామన్నారు. 5 ఎకరాల భూమి ఇవ్వడం సాధ్యంకాదన్నారు.
CTR: పుంగనూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ సమీపాన వెంకట్ రెడ్డి యాదవ్ మామిడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారిగా మాటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో గ్రంథాలయం నుంచి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో మభ్యపెడుతూ, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తుందని నాయకులు ఇంద్ర నాయక్ మండిపడ్డారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గత నవంబర్‌లో నిర్వహించిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోరుకునే అభ్యర్థులు మార్చి 9లోపు రూ.1,860 చెల్లించాలని, పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ఆయన సూచించారు.
కొలంబో వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. రెండో బెర్త్ కోసం కివీస్‌కి ఇందులో విజయం తప్పనిసరి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే.. ఆ టీమ్ సెమీస్ ఆశలన్నీ లంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.
SRD: జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకి జిన్నారం మున్సిపల్ సమస్యలపై ఛైర్మన్ జనార్ధన్ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలో తాగునీరు, డ్రైనేజ్, రహదారులు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకవర్గం కలెక్టర్‌ను సన్మానించారు.
SDPT: బెజ్జంకి(మం) రాంసాగర్ గ్రామంలో గోపాలమిత్ర, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఇంగాల లక్ష్మి–నాగమల్లేశం శిబిరాన్ని ప్రారంభించారు. మండల పశువైద్యురాలు డాక్టర్ హరిత పాడి పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరేశం రైతులు పాల్గొన్నారు.
RR: చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర రాజన్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సౌందర రాజన్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి
HNK: రోడ్డు ప్రమాద నివారణ కార్యక్రమంలో భాగంగా ఐనవోలు పోలీసులు శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన పున్నేలు గ్రామ శివారులోని ఏకశిలా స్కూల్ సమీపంలో, నేషనల్ హైవే–563పై హెవీ వాహన డ్రైవర్లకు ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నేత్ర పరీక్షలు నిర్వహించారు. చూపు సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేశారు.