• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఇవాళ దర్శించుకున్నారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బొబ్బిలి రోడ్డులో వెలసిన ఈ దేవాలయం ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలన్నారు.

February 23, 2026 / 04:18 PM IST

తమ్మయ్యపేటలో త్రాగునీటి కొరత

AKP: అచ్యుతాపురం మండలం దొప్పర్ల పంచాయతీ తమ్మయ్యపేటలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని శ్మశానానికి వెళ్లి చేతి బోరు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, మృతదేహాల దహనం సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. అధికారులు తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు.

February 23, 2026 / 04:18 PM IST

నూతల వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దామెర్పుల స్వరూప-సాంబయ్య దంపతుల కుమారుడు అనిల్ కుమార్-శ్రావణి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే KR నాగరాజు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులకు బహుమతి అందజేశారు.

February 23, 2026 / 04:17 PM IST

పాదయాత్రకు షాద్ నగర్ న్యాయవాదుల సంఘీభావం

RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.

February 23, 2026 / 04:16 PM IST

తాగునీటి సప్లై‌కు అంతరాయం

NDL: అవుకు పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజా వీధిలో భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా పైప్లైన్ ధ్వంసం కావడం వల్ల సంత మార్కెట్, చాకలిపేట, ఆర్టీసీ బస్టాండ్ కాలనీల ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం స్థానికులు అధికారులు ట్యాంకర్ల ద్వారా తక్షణ ప్రత్యామ్నాయ సరఫరా అందించాలని కోరుతున్నారు.

February 23, 2026 / 04:16 PM IST

EdCET పరీక్ష షెడ్యూల్ విడుదల

TG: TG EdCET 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. మే 12న రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో ఎంట్రన్స్ పరీక్ష, మే 30న ఫలితాలు రానున్నాయి.

February 23, 2026 / 04:15 PM IST

మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ బాధ్యతలు స్వీకరణ

విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీగా సీహెచ్ అంబేద్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో సిబ్బంది సమక్షంలో బాధ్యతలు చేపట్టి మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. మహిళల భద్రత, ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

February 23, 2026 / 04:14 PM IST

పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు గైర్హాజరు అంటే..!

KRNL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 823 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప మీడియాకు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 26,102 మంది హాజరయ్యారన్నారు.

February 23, 2026 / 04:14 PM IST

ALERT: నీటి సరఫరాలో అంతరాయం

ఆసిఫాబాద్ మండలం మాణిక్ వాడలోని 115 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారి రాకేశ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, సిర్పూర్ (టీ), బెల్లంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తి కాగానే సరఫరా పునరుద్ధరిస్తామనన్నారు.

February 23, 2026 / 04:14 PM IST

ఇంటర్ పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

ఏలూరు: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు.

February 23, 2026 / 04:13 PM IST

‘రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది’

జనగామ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. నాగర్ కర్నూల్ ఘటనను నిరసిస్తూ.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, జఫర్గడ్ ఎమ్మార్వోకు సోమవారం వినతిపత్రం అందించారు. బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతుని మండిపడ్డారు.

February 23, 2026 / 04:13 PM IST

పాల తయారీ కేంద్రంలో ఎస్పీ తనిఖీలు

AP: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ కోరుకొండ మండలం నరాసాపురానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందంతో కలిసి పాలతయారీ కేంద్రం వ్యాపారి ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో వినియోగదారులు, పశువుల రక్త నమూనాలు సేకరించారు. అలాగే వ్యాపారి ఇంట్లోని వెనిగర్, పాలు, కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

February 23, 2026 / 04:13 PM IST

లక్ష్మణేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

W.G: నరసాపురం (M) లక్ష్మణేశ్వరంలో శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ భీమవరం డివిజన్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3,52,089 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్. రామచంద్ర కుమార్, ఆలయ చైర్మన్ తెలిపారు.

February 23, 2026 / 04:12 PM IST

రైల్వే పెన్షనర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పీ. సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మండలోజు కృష్ణమూర్తి, కోశాధికారిగాక ఐలయ్య, ఉపాధ్యక్షులుగా హసన్ పాషా జీ. వెంకటనారాయణ ఎంపికయ్యారు.

February 23, 2026 / 04:12 PM IST

‘మహిళా కాంగ్రెస్ బలోపేతమే పార్టీ లక్ష్యం’

MLG: మహిళా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ప్రకటించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఈ ప్రకటన చేశారు. మండల ఇంఛార్జీలు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు.

February 23, 2026 / 04:11 PM IST