• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బడి పిల్లల కథా రచనలకు ఆహ్వానం

జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథారచనలను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథారచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు.

February 27, 2026 / 03:01 PM IST

ఇంటర్ పరీక్షల్లో 181 మంది విద్యార్థులు గైర్హాజరు

TPT: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. తిరుపతి జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.

February 27, 2026 / 03:01 PM IST

ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఆహ్వాన పత్రిక అందజేత

ATP: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యే పరిటాల సునీతకు అందజేశారు. గౌరు వెంకటరెడ్డి, చరితా రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె సనాతనితో నిశ్చయమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోటి ప్రజాప్రతినిధులను పెళ్లికి ఆహ్వానించారు.

February 27, 2026 / 03:01 PM IST

బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. HYDలో చికిత్స

HYD: వైసీపీ నేత, ఏపీ మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్‌కు తరలించారు. బంజారాహిల్స్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

February 27, 2026 / 03:01 PM IST

‘పాలన చేయడం చేతకాకపోతే రాజీనామా చెయ్’

ADB: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి అమలు చేయలేదని, పాలనా చేయడం చేతకాకుంటే రాజీనామా చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలు అమలు చేయకుంటే జిల్లా కేంద్రంలో భారీగా ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 03:01 PM IST

పశువులకు ఉచిత వైద్య శిబిరం

SRCL: ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ రడం లక్ష్మి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. పశు వైద్య అధికారుల బృందం పశువులను పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో EO DLDA శ్రీదేవి, వైద్యాధికారులు ఇందిరా, పూర్ణచంద్రిక, ఉప సర్పంచ్ ఓరుపుల లక్ష్మన్, వార్డ్ సభ్యులు పత్రీ అంజయ్య, దాసరి ఎల్లయ్య, రడం నాగయ్య పాల్గొన్నారు.

February 27, 2026 / 03:00 PM IST

70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 44,74,717 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతపురంలోని తన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 27, 2026 / 03:00 PM IST

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో గరివిడి హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

VZM: గరివిడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అండర్-14,17లో కుమారి శ్రీనిధి కు రజతం, భార్గవి రజితం, కీర్తి కి కాంస్యం, సాయి కి కాంస్యం పథకాలు సాధించారని ఇంఛార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జెడ్పీటీసీ సభ్యులు వాకడ శ్రీను, ఉప సర్పంచ్ కార్తీక్ అభినందించారు.

February 27, 2026 / 03:00 PM IST

‘ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి’

SKLM: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ టీ.ఎఫ్ ఉపాధ్యాయ శాఖ రాష్ట్ర కౌన్సిలర్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 03:00 PM IST

రజిత పథకం సాధించిన కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందనలు

AKP: బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్‌లో రజిత పతకం సాధించిన పోలీస్ కానిస్టేబుల్ జి. శ్రీనివాసరావును ఎస్పీ తుహీన్ సిన్హా అభినందించారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఈ నెల 9న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రజిత పథకం సాధించిన శ్రీనివాసరావు పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. శుక్రవారం కానిస్టేబుల్‌ను ఎస్పీ సత్కరించారు.

February 27, 2026 / 03:00 PM IST

‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి RDTతో ఒప్పందం’

NGKL: చెంచుపెంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్డీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. చెంచుపెంటలో చేపట్టిన ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ, గృహ నిర్మాణ శాఖల అధికారులు, RDT ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

February 27, 2026 / 02:59 PM IST

గ్రామాల్లో మెరుగైన సేవలందిస్తున్నాం: MPDO

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని వాపోయారు. MPDO అప్పాజీ మాట్లాడుతూ.. గ్రామాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.

February 27, 2026 / 02:59 PM IST

టాక్టర్ యజమానుల నిరసన

NZB: సాలూర మండలం మందార్నా గ్రామంలో ట్రాక్టర్ యజమానులు నిరసన చేపట్టారు. నూతన ఇసుక విధానం మన ‘ఇసుక వాహనం’ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నూతన విధానం వల్ల స్థానిక వాహన యజమానులకు అన్యాయం జరుగుతోందని సాలూర ఇంఛార్జ్ తహసీల్దార్ అనూషకు తమ గోడును చెప్పుకున్నారు. అయితే, ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు.

February 27, 2026 / 02:59 PM IST

‘విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి’

GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో పొలంబడి, పొలం పిలుస్తుంది కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్‌. మోహన్‌రావు మాట్లాడుతూ.. శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వేరు కుళ్లు తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.

February 27, 2026 / 02:58 PM IST

వడ్డెర సంఘ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతి

NLG: దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ను 14వ వార్డు కౌన్సిలర్ గాజుల సావిత్రి మురళీ, వడ్డెర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో వడ్డెర సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.

February 27, 2026 / 02:58 PM IST