• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజల నుంచి చెత్తను సేకరించిన స్వచ్ఛ రథం

AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం, వమ్మవరంలో స్వచ్ఛరథం శుక్రవారం చెత్తను సేకరించి ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను అందజేసింది. డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛరథం సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛ రథం దోహదపడుతుందన్నారు. ప్రజలు పొడి చెత్తను స్వచ్చ రధానికి అందించి అవసరమైన నిత్యవసర సరుకులను తీసుకోవాలన్నారు.

March 6, 2026 / 07:17 PM IST

రెండు రోజులు ట్రాఫిక్ మల్లింపు: సీఐ

CTR: ఈనెల 10, 11న రెండు రోజులపాటు పుంగనూరులో అత్యంత వైభవంగా జరుగు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసు శాఖ తరపున తీసుకున్న నిర్ణయాలను సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ మాట్లాడారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్ల చెప్పారు.

March 6, 2026 / 07:17 PM IST

మెగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డికల్లు పంచాయతీ చింతలపాడు గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లను ఆయన అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని పెంచుతాయని చెప్పారు.

March 6, 2026 / 07:15 PM IST

ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యల వెల్లువ

W.G: ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యలను చెబుతున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. రహదారులు, సాగునీరు తాగునీరు, తదితర అంశాలపై సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశాలు నామమాత్రంగా జరుగుతున్నాయని పలువురు పెదవి విరిచారు.

March 6, 2026 / 07:12 PM IST

సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

TG: యూపీఎస్సీ సివిల్స్ విజేతలకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న వారిలో 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరిలో సృజన, తరుణ్, లక్ష్మీరచన, వెంకటేష్, కౌశిక్, ప్రీతి, విక్రం, విక్రమ్ సింహారెడ్డి, ఆశిష్, విజయసింహారెడ్డి, నవీన్, రాహుల్, శ్రవణ్ కుమార్, ప్రవీణ్, ఇస్లావత్ శ్రీరామ్, బానోత్ భరత్, ప్రత్యూష్ కట్టా, జితేందర్ నాయక్, దీపక్ శర్మ ఉన్నారు.

March 6, 2026 / 07:10 PM IST

కోటి మంది మహిళా వ్యాపారవేత్తలే లక్ష్యం: మంత్రి సీతక్క

NZB: మహిళలు ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. NZB సెక్యూరిటీ కౌన్సిల్ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం ‘గివ్ టు గైన్’ స్ఫూర్తితో మహిళలకు బాసటగా నిలవాలన్నారు. నక్సలైట్ నుంచి మంత్రి వరకు తన ప్రయాణానికి విద్యే మూలమని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడమే లక్ష్యమన్నారు.

March 6, 2026 / 07:09 PM IST

‘రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి’

విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఆర్. గోవిందరావు శుక్రవారం తెలిపారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్త కొరతను తీర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

March 6, 2026 / 07:08 PM IST

రఘురామ టార్చర్ కేసులో IPS సునీల్ విచారణ

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ జరుగుతోంది. రెండో రోజు ఐపీఎస్ సునీల్ నాయక్‌ను 7 గంటలపాటు విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 9వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది.

March 6, 2026 / 07:07 PM IST

ప్రగతి ప్రణాళిక పరిశీలించిన MRO, ఎంపీడీవో

MDK: తూప్రాన్ మండలంలో ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు పరిశీలించారు. యావాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించి, పనుల పురోగతిపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే నర్సంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం మహిళా భవనాల్లో చేపట్టిన శుభ్రత కార్యక్రమాలను ఎంపీడీవో సతీష్ తనిఖీ చేశారు.

March 6, 2026 / 07:07 PM IST

సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి

కరీంనగర్ కలెక్టరేట్లో ఇవాళ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం సన్నాహక సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 6, 2026 / 07:07 PM IST

‘యాదాద్రి జిల్లా గొప్ప అవకాశాన్ని కల్పించింది’

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని, ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని పూర్వ కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పూర్వ కలెక్టర్ హనుమంతరావు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు TNGO, తహసీల్దారులు, MPDOలు అధికారులందరూ ఘనంగా సత్కరించారు.

March 6, 2026 / 07:06 PM IST

‘పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి’

MBNR: పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం జిల్లా సమీపంలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ‘ముడా’ నిధులతో నిర్మించిన RO వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.ఉమ్మడి జిల్లాను వలసల నుంచి ఉపాధి కల్పన వైపు మారుస్తున్నామని, విద్యలో జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలని అన్నారు.

March 6, 2026 / 07:05 PM IST

‘మహిళలు సంఘటితంగా ముందుకు రావాలి’

VSP: అంతర్జాతీయ మహిళా దినోత‍్సవం సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. కుట్టు, కంప్యూటర్ శిక్షణ పొందుతున్న మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా క్రీడా అధికారిణి జూన్‌ గాలియట్‌ మాట్లాడుతూ.. మహిళలు క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఆసరా చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సునీత మహిళలు శిక్షణ ద్వారా స్వయం సమృద్ధి సాధించాలన్నారు.

March 6, 2026 / 07:03 PM IST

రేపు జిల్లాకు రానున్న మంత్రి కోమటిరెడ్డి

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం క్లాక్ టవర్ సెంటర్‌లోని ఇందిరా భవన్‌కు చేరుకుంటారు. ప్రజలకు ఉదయం 9:30 నుంచి మ.12 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను, వినతులను స్వీకరిస్తారు. అనంతరం ఉమ్మడి జిల్లా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ సమగ్ర కార్యాచరణపై జరిగే సమావేశంలో పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

March 6, 2026 / 07:03 PM IST

సివిల్స్ టాప్ ర్యాంకర్ స్టోరీ ఇదే..!

ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇతడు జోధ్‌పుర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2023లో యూనియన్ టెరిటరీస్ సివిల్ సర్వీసెస్ సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఎస్‌డీఎంగా ప్రొబేషన్‌లో ఉన్నాడు. మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు.

March 6, 2026 / 07:03 PM IST