SDPT: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని వర్గల్ గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులు పశువులను కసాయి ఖానాకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
VKB: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై BLOలతో, సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు BLOలతో 80% ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ASR: డుంబ్రిగూడ మండలం కోసంగి గ్రామంలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల వైసీపీ కార్యదర్శి శంకర్ ఇవాళ డిమాండ్ చేశారు. ప్రస్తుతం గ్రామంలో సీసీ రోడ్డు కొంతమేర మాత్రమే నిర్మిస్తున్నారని తెలిపారు. దీంతో వర్షాకాలంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని కోరారు.
CTR: వెంకటగిరి రూరల్ మండలం చిన్నన్నపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ దవల రామయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సత్యసాయి: కార్యకర్తలకు అన్యాయం జరిగిందని పార్టీ అధినాయకుడు జగన్ గ్రహించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 9 వేల మందితో కమిటీలు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన తిరుపతమ్మ రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, శనివారం రైలు పట్టాల వద్దకు వెళ్లింది. సమాచారం తెలుసుకున్న SI సంధ్యారాణి, బ్లూ కోర్ట్ సిబ్బంది అశోక్‌ను అక్కడికి పంపించి తనను కాపాడారు.
HYD: సింగపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది దానిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం బాంబు నిర్వీర్య బృందం విమానంలో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది.
WGL: ఉమ్మడి జిల్లా మహిళలకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనదని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో సత్తా చాటుతున్న మహిళా శక్తికి హృదయపూర్వక వందనం తెలిపారు. మహిళలు సమాజంలో సమానత్వం, సాధికారత కోసం అవిరామంగా కృషి చేస్తున్నారని అన్నారు.
MNCL: జిల్లాలో సర్వేయర్ల కొరతతో భూ సర్వే నిలిచిపోతోంది. మొత్తం 18 మండలాలు ఉండగా, కేవలం 8 మండలాలకే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు, మూడు మండలాల బాధ్యతలను అధికారులు అప్పగించారు. పిటీషన్ పెట్టుకున్న దరఖాస్తుదారుల భూముల సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది. లైసెన్స్ సర్వేయర్లు వచ్చిన వారికి విధులు, బాధ్యతలు అప్పగించలేదు.
KMM: సత్తుపల్లి మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొని మహిళా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్, సీడీపీవో అధికారులు పాల్గొన్నారు.
ATP: సాధారణంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ఫేమస్. జిల్లాలో చేసే ప్రత్యేకమైన వంటకాల్లో ఉగ్గాని ఒకటి. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో ఉగ్గాని, బజ్జీలతో కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు. జిల్లాలో ఏ టిఫిన్ సెంటర్‌కి వెళ్లిన ఉగ్గాని బజ్జీ కచ్చితంగా లభిస్తుంది. ఈ ఉగ్గాని రెసిపీ వేడివేడి మిర్చీ బజ్జీలతో ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.
MBNR: మార్చి 15న మాలల ఆత్మీయ సభ నిర్వహిస్తున్నట్లు మాలల చైతన్య సమితి వ్యవస్థాపకులు మూల కేశవులు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు, వార్డు మెంబర్లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
AKP: జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని అనకాపల్లి జిల్లా జనసేన అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. శనివారం పాయకరావుపేటలో నియోజకవర్గం జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశంలో రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
AP: నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తి, రాడ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కర్నూలుకు చెందిన హేమంత్ కుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అడ్డుకున్న మహిళా వార్డెన్, సెక్యూరిటీపైనా దాడి చేసి విద్యార్థి పరారయ్యాడు. డ్రగ్స్‌కు బానిసలై ఇలా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో జరిగింది.
KNR: మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఈనెల 29వ తేదీలోగా మున్సిపాలిటీల్లో సమర్పించాలి. మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థులకు గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు, కార్పొరేషన్లలో రూ.1.5 లక్షల వరకు ఎన్నికల ఖర్చు పరిమితి నిర్ణయించారు. నిర్ణీత గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులపై ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.