ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కాపు వాడలో పోచమ్మ ఆలయం స్థల సేకరణ చేయాలని 6వ వార్డ్ కౌన్సిలర్ ఎమ్మాజీ శారదా సంతోష్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. ఆలయ స్థలం సేకరణకై పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు.
NLG: తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై మద్యం మత్తులో దాడి చేసి, కెమెరాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తిధర్మంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు అమానుషమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్యాల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
SRPT: అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో మంగళవారం ఘనంగా ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. అనంతగిరి సెక్షన్ అధికారులు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ పర్యటన చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజాబాట ద్వారా సేకరించిన వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
BDK: మణుగూరు మున్సిపాలిటీ పల్లె దవాఖాన వరకు సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడనున్న సైడ్ డ్రైన్ పనులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తామన్నారు.
NRPT: క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిర్వహించిన సీఎం కప్ కుస్తీ పోటీల్లో ఊట్కూర్ మండలం అవుసలోనిపల్లికి చెందిన విద్యార్థి నరహరి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారుడితో తలపడిన నరహరి 74 కిలోల విభాగంలో విజయం సాధించి, ప్రశంసాపత్రం, రూ.10,000 నగదు బహుమతి పొందాడు.
KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఈ నెల 24, 25, 26 తేదీల్లో విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ముఖ్య సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం తెలిపింది. 27వ తేదీ నుంచి మళ్లీ యథావిధిగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం వెల్లడించింది.
CTR: తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం పుంగనూరు రాంపల్లి సమీపానగల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రిలే దీక్షలు చేపట్టారు. వేతనాలు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
BHPL: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, డిజైనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని BHPL జిల్లా చేనేత & జోలి శాఖ సహాయ సంచాలకులు వై. శ్రీకాంత్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
MNCL: బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు సమీపంలో రోడ్డు భద్రతపై మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
VSP: అమరావతి సచివాలయంలో సింహాచలం దేవస్థానం భూ వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు విశాఖ ఎంపీలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజులు పాల్గొని భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు వెల్దుర్తిలో నేటీతో 2వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్మికులు దీక్షలను కొనసాగిస్తున్నారు. 2వ రోజు దీక్షలను చిన్న వ్యాపారస్తుల కర్నూలు కమిటీ సభ్యుడు రామాంజనేయులు ప్రారంభించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
చాలామంది ముఖంపై పెట్టే శ్రద్ధ కాళ్లు, చేతులపై పెట్టకపోవడంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారుతుంటాయి. ఈ సమస్యను నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. రోజుకు రెండుసార్లు అలోవెరా జెల్ రాస్తే నలుపు తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్, పంచదార మిశ్రమంతో స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
TG: HYD అంబర్ పేటలో కుటుంబం ఆత్మహత్య తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఉందన్నారు. అయితే అప్పులిచ్చినవారు బెదిరించినట్లు తమకు అనుమానం ఉందన్నారు. ముందు భార్యను చంపిన రామ్ రాజ్.. తర్వాత ఆయన ఉరి వేసుకుని, కొడుకు చెయ్యి కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
KRNL: ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 101వ రోజుకు చేరాయి. జేఏసీ నాయకులు దస్తగిరి నాయుడు, అశోకానంద రెడ్డి, రఘురామయ్య, కృష్ణమూర్తి, కమతం వెంకటేష్ దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని JAC నాయకులు డిమాండ్ చేశారు.
AP: అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. ఆకతాయిలను గుర్తించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. రజియా హుసేన్ పేరుతో జిల్లాలోని అన్ని కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అన్ని కోర్టుల వద్దకు డాగ్ స్క్వాడ్‌తో వెళ్లి సోదాలు చేస్తున్నారు.