KMR: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై మంత్రితో చర్చించగా, కామారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని ఛైర్‌పర్సన్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ఆమె సత్కరించారు.
టోల్‌గేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి టోల్‌గేట్లలో నగదురహిత లావాదేవీలు జరగాలని ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లనే అనుమతించాలని సూచించింది. దీంతో ఇకపై టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతి లభించనుంది.
PDPL: ధర్మారం ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సహాయార్థం పాఠశాలలో ఆన్లైన్ చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ తెలిపారు. 2026- 27 సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు చేరే అభ్యర్థులు ఈనెల 28లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
ADB: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, డౌన్‌లోడ్ చేసినా, సోషల్ మీడియాలో షేర్ చేసిన, ఆన్లైన్లో చూసిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలియజేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక తీవ్రమైన నేరమని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలోని సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు ‘1912’ అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. వినియోగదారులు ఈ నంబరుకు కాల్ చేసి ఐవీఆర్ఎస్‌లో 5 అంకెను నొక్కి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీని ద్వారా సోలార్ విక్రేతలు నిర్ణీత సమయంలోగా సమస్యను పరిష్కరిస్తారని వివరించారు.
తూ.గో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నిమిత్తం ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం సమావేశమైయ్యారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం ఇవ్వాలన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ అమ్మవారికి శుక్రవారం వెండి వస్తువును బహుకరించారు. పొదలకూరు వాస్తవ్యులు కర్ణం కామాక్షి ఆర్థ్య, పేరున కర్ణం కామాక్షి కార్తిక్ శ్రీ స్వామి అమ్మవార్ల పై భక్తి తో నిత్య ఆర్జిత సేవల్లో ఉపయోగించిటకు సుమారు 94 గ్రాములు విలువైన వెండి వస్తువును అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దర్శనం కల్పించారు.
ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం మంత్రి స్వామి స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. అనంతం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు అర్జీల సేకరణ ఉంటుందన్నారు.
ADB: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ ASI సురేందర్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కేబీ కాంప్లెక్స్ లో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ ద్వారా వచ్చే OTP, KYC పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలకు గురైతే 1930 కు సంప్రదించాలని కోరారు.
AP: గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ చెల్లూరి నగేష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన నగేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గంజాయి కేసులో నగేష్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా వైసీపీ ముఖ్య నాయకుడికి ఆయన అనుచరుడిగా ఉన్నారు.
PLD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజి రావు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు.
KDP: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళ మెడలో ఉన్న సుమారు 22 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
NGKL: కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్ ఛైర్మన్‌గా షేక్ రహీం పాషా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది నూతన పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
SRD: సదాశివపేట మున్సిపల్ ఛైర్మన్ అంజమ్మ ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్మల రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రావీణ్యను శుక్రవారం కలిశారు. నూతనంగా గెలిచిన కౌన్సిల్ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MNCL: ఈ నెల 17న హైదారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం భవిత కేంద్రంలో డీఈవో యాదయ్య విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.