• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిత్తు బొత్తు ఆటపై పోలీసుల దాడులు

MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చిత్తుబొత్తు ఆటపై పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేశారు. చిత్తు బొత్తు ఆట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 24,570 లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నలుగురు వ్యక్తులు పారిపోయారని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

February 28, 2026 / 06:30 PM IST

రెవిన్యూ ప్రజలకు చేరువ కావాలి: MLA గంటా

VSP: ఆధునికీకరించిన భీమిలి ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌లో ఎక్కువ ఫిర్యాదులు రెవిన్యూపైనే వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు చేరువ కావాలని అధికారులకు సూచించారు. దివీస్ యాజమాన్యం కార్యాలయానికి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు.

February 28, 2026 / 06:30 PM IST

పలు పాఠశాలలో ఉత్సాహంగా సైన్స్ దినోత్సవం

SKLM: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జలుమూరు మండలం పలు పాఠశాలలో శనివారం ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు చూపించిన అత్యున్నత విజ్ఞానంతో అనేక పరికరాలను చేసి పదిమందికి ప్రదర్శించారు. విద్యర్థుల ప్రగతికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:30 PM IST

వెంకటేశ్వర స్వామి అలంకరణలో ఓ యువతి..!

JN: జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ మండపం వద్ద ఒక యువతిని వెంకటేశ్వర స్వామి వేషధారణలో అలంకరించి ఉంచడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ క్షణం కలియుగ దైవం వేయి నామాల వెంకటేశ్వరుడే కళ్లముందు కదలాడినట్లు అనిపించిందని భక్తులు చెప్పారు.

February 28, 2026 / 06:30 PM IST

జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం

VZM: జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రజా ప్రతినిధులకు, జెసి సేధు మాధవన్‌కి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ విభాగానికి మరియు వివిధ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 06:30 PM IST

‘సాంగ్వి అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి’

ADB: సాత్నాలలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును సర్పంచ్ ఆత్రంనగేష్ కోరారు. ఈ విషయమై శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్డు, డ్రైనేజ్, పొలం బాట, పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 28, 2026 / 06:29 PM IST

పోలీస్ శాఖకు సేవలు చిరస్మరణీయం

KDP: ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ పొందిన కడప టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వీ.ఎస్. దేవ ప్రసాద్‌ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన క్రమశిక్షణతో కూడిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సమయం గడుపుతూ.. ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.

February 28, 2026 / 06:26 PM IST

కేయూలో మార్చి 2న జిల్లా స్థాయి పోటీలు

HNK: కేయూ ఇంజినీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో VBYP 2026 హనుమకొండ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఈ పోటీలు మార్చి 2న కేయూలో నిర్వహిస్తామన్నారు. 2025 సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలన్నారు.

February 28, 2026 / 06:26 PM IST

తణుకు సబ్ జైలును పరిశీలించిన న్యాయమూర్తి

W.G: తణుకు సబ్‌ జైలును నాలుగో అదనపు జిల్లా జడ్జి డీ.సత్యవతి శనివారం సందర్శించారు. సబ్‌జైలులో ఉన్న రిమాండ్‌ ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగి ఉండాలని, ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేక పోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు.

February 28, 2026 / 06:26 PM IST

లింగారెడ్డిపేటలో చిరుత సంచారం

MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో శనివారం రెండు దూడలపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్, బావని ఐలయ్య పొలాల వద్ద ఉన్న రెండు దూడలపై దాడి చేసి చంపినట్లు వివరించారు. అటవీ శాఖ సహాయ రేంజ్ అధికారి చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

February 28, 2026 / 06:26 PM IST

‘చిల్లర రాజకీయం మానుకోవాలి’

KNR: హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ భూస్థాపితమవడం ఖాయమని కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టంచేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం దేవతల సాక్షిగా చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని దూషించడం ఆయన మతిభ్రమణానికి నిదర్శనమని, ఆయన మీద ఉన్న కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:25 PM IST

హుజూర్‌నగర్‌లో టైలర్స్ డే వేడుకలు

SRPT: హుజూర్ నగర్‌లో విలియమ్స్ హోవే జయంతి సందర్భంగా టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు షేక్ బాజీ ఉల్లా టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆధునిక యంత్రాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ జెండా ఆవిష్కరించారు.

February 28, 2026 / 06:24 PM IST

రిటైర్డ్ పోలీసులను సన్మానించిన ఎస్పీ

NRML: పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి, నేడు పదవి విరమణ పొందుతున్న రాథోడ్ భీమ్ రావ్(ASI),ఎండి అబ్దుల్ రౌఫ్(ASI), ముంతాజ్ ఖాన్(ARHC), ఎం.డి.ఇంతియాజ్( Sr.Asst)లనుజిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సన్మానించారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడుతూ.. విధి నిర్వహణలో వారు చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

February 28, 2026 / 06:24 PM IST

కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరికలు

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో BJP పార్టీలో చేరిక, అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి బీజేపీ పార్టీతో సాధ్యమని అన్నారు.

February 28, 2026 / 06:23 PM IST

‘విద్యార్థులు శాస్త్రియ దృక్పదాన్ని అలవార్చుకోవాలి’

CTR: విద్యార్థులు శాస్త్రీయ దృక్పధం అలవార్చుకోవాలని ఏంఈవో హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. శనివారం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు HM సుమతి, సీఆర్‌సీ కార్యదర్శి వెంకమరాజు బహుమతులు అందజేశారు.

February 28, 2026 / 06:23 PM IST