• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కదిరి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

SS: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు జరిగే ఈ వేడుకలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 06:08 AM IST

పెద్దపల్లిలో నిరుద్యోగులకు TASK ఉచిత శిక్షణ

పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023–2026లో డిగ్రీ, పాలిటెక్నిక్, మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన వారు అర్హులు. నమోదు FEB 25–28 వరకు, శిక్షణ MAR 2–22 వరకు ఉంటుంది. మొత్తం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి.

February 26, 2026 / 06:08 AM IST

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి

WNP: వీవనగండ్ల మండలం కల్వరాల గ్రామాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అదే విధంగా మహిళా సంఘం బిల్డింగు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వరాల సర్పంచ్ బండారాముడు, ఉప సర్పంచ్ తడకల రంగమ్మ, వార్డ్ మెంబర్లు, అఖిల్ పాషా పూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:07 AM IST

సబ్సిడీపై వరిగడ్డి కట్టే మిషన్ల పంపిణీ

SRPT: మునగాల మండలం గణపవరం రైతు సావిత్రి, కృష్ణకు 50% సబ్సిడీతో వరిగడ్డి కట్టే మిషన్‌ను ఏవో రాజు పంపిణీ చేశారు. మండలంలో ఇంకా 4 ఎస్సీ, 2 ఎస్టీ కోటా మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులు ఈ శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరారు.

February 26, 2026 / 06:07 AM IST

ఈనెల 27న ధర్‌పల్లిలో ఇసుక వేలం

NZB: ధర్‌పల్లి మండలం కొటాల్ పల్లి, హోన్నజీపేట్ గ్రామాల్లో ఇటీవల అక్రమంగా డంపు చేసిన 200 ట్రాక్టర్ల ఇసుకను ఈనెల 27న తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వేలం వేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు

February 26, 2026 / 06:04 AM IST

‘యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి’

NLG: 2025-26 యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్‌లో 2025- 26 యాసంగి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు ,రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 26, 2026 / 06:04 AM IST

స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: హకీంపేట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి NZB జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు DYSO రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. 20 సీట్లు(10 బాలురు,10 బాలికలు) అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు https://tgss.telangana.gov.in/ ద్వారా ఇవాళ నుంచి MAR 4 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు

February 26, 2026 / 06:03 AM IST

కాటారంలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

BHPL: కాటారంలోని ఓ హైస్కూల్‌లో ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ సూచనలు పాటించే అవసరం వివరించారు. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తలు, సీసీ కెమెరాల ప్రయోజనం గురించి తెలిపారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గి సురక్షిత ప్రయాణం సాధ్యమని సూచించారు.

February 26, 2026 / 06:03 AM IST

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్‌కి అంతరాయం

E.G: సీతానగరం మండలం ముగ్గుల సబ్స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE నటరాజన్ తెలిపారు. రోడ్డు మరమ్మతుల కారణంగా రఘుదేవపురం, సింగవరం గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 26, 2026 / 06:02 AM IST

మైనింగ్ ఉద్యోగం పేరిట రూ. 15 లక్షల మోసం

BPT: కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్‌ను మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు వసూలు చేశారు. నియామక పత్రం, ఐడీ కార్డు ఇచ్చి క్వారీలో పని పెట్టి నెలరోజులకు రూ.18 వేలు ఇచ్చారు. తర్వాత క్వారీ మూసేయడంతో మోసం బయటపడింది. చెక్ బౌన్స్ కావడంతో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 26, 2026 / 06:02 AM IST

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NLR: కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు చిన్నపడుగుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.

February 26, 2026 / 06:01 AM IST

రాజంపేటలో పశువులకు వింత వ్యాధి

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో ఆవులు, లేగదూడలు వింత చర్మ వ్యాధితో బాధపడుతున్నాయి. వాటి శరీరాలపై దద్దుర్లు ఏర్పడి, చర్మం ఊడిపోయి పుండ్లు అవుతున్నాయి. దీంతో పశువులు మేత మేయలేక నీరసించిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని, లేదంటే మూగజీవాలు నరకయాతన అనుభవిస్తాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 06:00 AM IST

ఎక్సైజ్ అధికారుల దాడులు.. స్కూటీ సీజ్

NLR: మిడుతూరు మండలం తిమ్మాపురం వద్ద స్కూటీపై 5 లీటర్ల నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ తెలిపారు. ఈ ఘటనలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తి స్కూటీని వదిలి పరారైనట్లు చెప్పారు. అదేవిధంగా లక్ష్మాపురంలో కాలియ అనే వ్యక్తి నుంచి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 06:00 AM IST

క్రికెట్ ఆడి అలరించిన మంత్రి అచ్చెన్నాయుడు

SKLM: విజయవాడలోని శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం ఆట విడుపు’ పోటీల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ, మైదానంలో సందడి చేశారు. స్టేడియం మొత్తం క్రీడా స్ఫూర్తితో కళకళలాడింది. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని మంత్రి తెలిపారు.

February 26, 2026 / 06:00 AM IST

ఆదోని డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం

KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.

February 26, 2026 / 05:52 AM IST