• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

ASR: అరకు రైల్వే ఆస్పత్రిలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీ నింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆస్పత్రి పీఆఓ్వ పీ.ఆనంద్ తెలిపారు. విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్, ఆరిలోవ మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. శిబిరంలో బీపీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాప్ స్మియర్ పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.

February 26, 2026 / 10:00 AM IST

కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం వన్నాం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 26, 2026 / 10:00 AM IST

జిల్లా ఇంఛార్జ్ కమిషనర్‌గా రాకేశ్ చంద్ర

కడప నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్‌గా, ప్రస్తుత అడిషనల్ కమిషనర్‌గా ఉన్న రాకేశ్ చంద్రను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డిని ప్రభుత్వం సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో రాకేశ్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 10:00 AM IST

ప్రభాస్, బుచ్చిబాబు కాంబోలో మూవీ..!

రామ్ చరణ్‌తో ‘పెద్ది’ మూవీ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, తన తదుపరి మూవీని రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు ఇప్పటికే ఒక సాలిడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.

February 26, 2026 / 09:59 AM IST

జిల్లాకు నూతన కలెక్టర్

HNK: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఇప్పటికే ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలు కూడా అదనపు బాధ్యతలుగా చేపట్టనున్నారు.

February 26, 2026 / 09:58 AM IST

దేవాలయ భూములను సంరక్షించాలి: ఎమ్మెల్యే

KRNL: దేవాలయ భూములు ప్రభుత్వ ఆస్తులు కావని, వాటిని అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదని ఆదోని MLA పార్థసారధి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆలయ భూములను లీజులు, స్టేడియాలకు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ భూములను ప్రభుత్వం కాపాడాలని, ధార్మిక సంస్థల అభిప్రాయాలతో సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

February 26, 2026 / 09:56 AM IST

నటి రన్యా రావుకు మరిన్ని చిక్కులు

ప్రముఖ నటి రన్యా రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.102 కోట్ల విలువైన భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెపై ఈడీ సంచలన ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏడాది కాలంలో సుమారు 127 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

February 26, 2026 / 09:54 AM IST

మెడకు తగిలిన కేబుల్ వైర్లు.. తప్పిన ప్రాణాపాయం

W.G: సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 26, 2026 / 09:50 AM IST

నేటి మిర్చి ధరలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.18400, క్వింటాల్ 341 (కారం కాయ) ధర రూ.21000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.24000, క్వింటాల్ వండర్ హాట్ మిర్చి ధర రూ.37000, క్వింటాల్ టమాటో మిర్చి ధర రూ.40000గా పలికింది. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 09:50 AM IST

స్వల్పంగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200గా నమోదైంది. అయితే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

February 26, 2026 / 09:47 AM IST

కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో స్వయం సహాయక సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:46 AM IST

షాపల్లి, అమ్మనబోలులో బెల్టు దుకాణాలు బంద్

NLG: నార్కట్‌పల్లి మండలం, షాపల్లి, అమ్మనబోలు గ్రామ పంచాయతీలు గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి హెచ్చరించింది. అటు అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఈ మార్పు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి మరి.

February 26, 2026 / 09:46 AM IST

విశాఖకు రూ. 32,373 కోట్ల రుణ లక్ష్యం

VSP: నాబార్డ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 32,373 వేల కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 వేత కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని బ్యాంకులకు సూచించారు.

February 26, 2026 / 09:45 AM IST

ద్వితీయ సంవత్సర పరీక్షలు.. జమ్మికుంటలో 3 కేంద్రాలు

KNR: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 424, వొకేషనల్ విద్యార్థులు 245 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

February 26, 2026 / 09:43 AM IST

మంత్రిని కలిసిన నూతన పాలకవర్గం

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వెంకటస్వామిని కలిశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత, వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.

February 26, 2026 / 09:43 AM IST