TG: మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత.. చట్టపరిధిలో ఏదైనా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మావోయిస్టు దేవ్ జీ.. తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందన్నారు. రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరామన్నారు. 5 ఎకరాల భూమి ఇవ్వడం సాధ్యంకాదన్నారు.
CTR: పుంగనూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ సమీపాన వెంకట్ రెడ్డి యాదవ్ మామిడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారిగా మాటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో గ్రంథాలయం నుంచి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో మభ్యపెడుతూ, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తుందని నాయకులు ఇంద్ర నాయక్ మండిపడ్డారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గత నవంబర్‌లో నిర్వహించిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోరుకునే అభ్యర్థులు మార్చి 9లోపు రూ.1,860 చెల్లించాలని, పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ఆయన సూచించారు.
కొలంబో వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. రెండో బెర్త్ కోసం కివీస్‌కి ఇందులో విజయం తప్పనిసరి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే.. ఆ టీమ్ సెమీస్ ఆశలన్నీ లంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.
SRD: జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకి జిన్నారం మున్సిపల్ సమస్యలపై ఛైర్మన్ జనార్ధన్ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలో తాగునీరు, డ్రైనేజ్, రహదారులు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకవర్గం కలెక్టర్‌ను సన్మానించారు.
SDPT: బెజ్జంకి(మం) రాంసాగర్ గ్రామంలో గోపాలమిత్ర, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఇంగాల లక్ష్మి–నాగమల్లేశం శిబిరాన్ని ప్రారంభించారు. మండల పశువైద్యురాలు డాక్టర్ హరిత పాడి పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరేశం రైతులు పాల్గొన్నారు.
RR: చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర రాజన్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సౌందర రాజన్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి
HNK: రోడ్డు ప్రమాద నివారణ కార్యక్రమంలో భాగంగా ఐనవోలు పోలీసులు శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన పున్నేలు గ్రామ శివారులోని ఏకశిలా స్కూల్ సమీపంలో, నేషనల్ హైవే–563పై హెవీ వాహన డ్రైవర్లకు ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నేత్ర పరీక్షలు నిర్వహించారు. చూపు సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేశారు.
నారాయణపేట: నర్వ మండలం రాయికోడ్ గ్రామం 10వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కొత్త ఎస్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. సర్పంచ్ పీ. శశికళ రవికుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వీటిని అమర్చారు. రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఎస్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.
ASF: మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరుతూ MLC దండే విఠల్‌కు కాగజ్ నగర్‌లో శుక్రవారం ఆ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్రావు, జిల్లా అధ్యక్షుడు వాసు, విజయ్ శ్రీనివాస్, వసంత్ పాల్గొన్నారు.
GDWL: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని గట్టు ఎస్సై శేఖర్ గౌడ్ కోరారు. గోర్లఖాన్ దొడ్డి పాఠశాల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల పైచదువుల ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. 42 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు.
NRML: ఖానాపూర్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గురిజాల నడిపి నరహరి, భూటా శంకర్, చీమల శ్రీకాంత్, బూర్క లక్ష్మణ్, గాదె రమేష్, దాసన్ల శ్రీనివాస్ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ జిల్లా సమీకృత కలెక్టరేట్లో సీఎం కప్ 2025 క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. జిల్లా నుంచి పాల్గొన్న 22 మంది క్రీడాకారులలో 4 బంగారు, 8 వెండి, 10 కంచు పథకాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.