• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షకు 810 మంది విద్యార్థుల గైర్హాజరు

ATP: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 22,800 మంది, ఒకేషనల్ విభాగంలో 2,469 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 810 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన బోర్డు అబ్జర్వర్ సౌజన్య పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

February 25, 2026 / 07:34 PM IST

రూ.43 కోట్ల నష్టం కలిగించిన ధాన్య మాఫియా అరెస్ట్

NLG: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించిన ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను పట్టుకున్నాయి. అరెస్టు చేసిన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 07:34 PM IST

మండల వ్యవసాయ అధికారి సస్పెండ్

PDPL: ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగిన తనిఖీల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

February 25, 2026 / 07:34 PM IST

‘నర్సంపేటలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’

WGL: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యమని ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం 4వ వార్డులో పర్యటించి లీకైన మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, సైడ్ కాలువలు సహా అభివృద్ధి పనులు చేపట్టి వార్డు సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

February 25, 2026 / 07:33 PM IST

బృందావన్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మెరుపు తనిఖీ

GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెంటనే స్పందించారు. స్వయంగా ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకోగా, ఆమెను చూసి యువకులు పరారయ్యారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆ ప్రాంతంలో పోలీస్ గస్తీ నిర్వహించాలన్నారు.

February 25, 2026 / 07:31 PM IST

లండన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్దాపురం యువకుడి మృతి

కాకినాడ: లండన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్దాపురం కొండయ్య పేటకు చెందిన గొంతి అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. క్రోయిడాన్ డప్పాసి హిల్ టెర్రస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. 2023లో ఎంబీఏ చదివేందుకు అభిషేక్ లండన్ వెళ్లారు. అభిషేక్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

February 25, 2026 / 07:31 PM IST

లీడ్ బ్యాంకు మేనేజర్‌కు సన్మానం

KNR: ఈనెల 28న లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట సీతా రామాంజనేయులు ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని KDCCBలో సన్మాన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యంలో లీడ్ బ్యాంకు మేనేజర్ అందించిన సేవలను కొనియాడారు.

February 25, 2026 / 07:30 PM IST

నెక్స షోరూంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

కృష్ణా: పెనమలూరు(M) కానూరు సంతోష్ నెక్స షోరూంను కలెక్టర్ బాలాజీ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ షోరూమ్ యజమానితో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి సేవలు అందుతున్నాయి ? ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనంలో రిజిస్ట్రేషన్ బీమా పన్నులు వసూలు బోర్డులను పెట్టాలని తెలిపారు.

February 25, 2026 / 07:30 PM IST

గోశాలకు పశుగ్రాసం వితరణ చేసిన దాతలు

NLR: నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు వరికుంటపాడు నరసింహపురం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాసాన్ని ఆలయ నిర్వహకులకు బుధవారం అందజేశారు. గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవులను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు.

February 25, 2026 / 07:29 PM IST

గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన : రాయల నాగేశ్వరరావు

KMM: ముదిగొండలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఉన్నారు. భవనం దుస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు త్వరలోనే మరమ్మతులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టా ఉపేందర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 07:28 PM IST

‘దివ్యాంగులకు బడ్జెట్‌లో 5% నిధులు కేటాయించాలి’

SRD: దివ్యాంగులకు బడ్జెట్లో 5% నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్న 6000 పింఛన్ ఇస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు.

February 25, 2026 / 07:28 PM IST

కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి

ELR: ముసునూరు(మం) సూరేపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ఈ దాడులలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, రూ. 8700 నగదు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

February 25, 2026 / 07:27 PM IST

400 ఏళ్ల కోనేరు శుభ్రపరిచిన సేవా ఫౌండేషన్

SDPT: దుబ్బాక మండలం ధర్మాజీపేటలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ కోనేరును గ్రామ యువత పునరుద్ధరించారు. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన కోనేరును, ఆలయ పరిసరాలను యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా శుభ్రం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ పునఃప్రక్షాళన చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుతారి సందీప్ తెలిపారు.

February 25, 2026 / 07:26 PM IST

‘వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి’

అన్నమయ్య: రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల వైపు మళ్లాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ వినియోగంపై సూచనలు చేసి, భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 07:25 PM IST

‘రైతులపై దౌర్జన్యం ఆపాలి’

KRNL: తుగ్గలి(మం) రేల్లపాడు తాండలో రీ న్యూ ప్రైవేట్ విండ్ పవర్ కంపెనీ రైతులు నాగేంద్ర నాయక్, సురేష్ నాయక్‌ల పొలాల్లో హెన్డీ లైన్లు వేయడానికి ప్రయత్నించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. కంపెనీకి వత్తాసు పలుకుతున్న తుగ్గలి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 07:25 PM IST