CTR: స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డుకు కుప్పం మున్సిపాలిటీ ఎంపికైంది. మొత్తం 21 క్యాటగిరీలో జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో 69 జిల్లా స్థాయిలో 1257 అవార్డులు ఇవ్వనుంది. ఇందులో కుప్పం మున్సిపాలిటీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈనెల 6న విజయవాడలో కుప్పం కమిషనర్ ఈ అవార్డు అందుకుంటారు.
W.G: ఉండి మండలంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు ఇవాళ పర్యటించారు. గ్రామంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన కిట్టమ్మ చెరువు వద్ద మైక్రో ఫిల్టర్ బెడ్, సంత మార్కెట్లోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ బెడ్‌ను ఆయన ప్రారంభించారు.
KRNL: పెద్దకడబురులోని MPDO కార్యాలయంలో ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి ఎంపీడీవో జయరాముడు, రామ్మోహన్ రెడ్డి పూలమాలలతో నివాళులర్పించారు. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వారు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
VZM: తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు పట్టుచీర కొంటానన్న చందంగా తయారైంది కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం పరిస్థితి. వర్షం పడిన కాసేపటికే కార్యాలయం చుట్టూ వర్షం నీరుతో జలమయం అవుతున్నా.. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుంది. వర్షం నీరుతో జలమయమవుతున్న గ్రామాల పరిస్థితి ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BDK: దమ్మపేట మండలం నాచారం గ్రామంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ జగదంబ సమేత జయ లింకేశ్వర స్వామి దేవాలయమును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజయదశమి పండుగ చెడుపై మంచి గెలిచిన రోజును స్ఫూర్తిగా కలిగిస్తుందన్నారు.
JN: జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశాన్ని బుధవారం నిర్వహించినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు సౌడ రమేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మరియు హామీలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాకి వినతిపత్రాన్ని అందించినట్లు తెలిపారు.
JGN: పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశం స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ గారి పాత్ర అపూర్వమైందని, ఆయన అహింసా సిద్ధాంతం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైందని పేర్కొన్నారు.
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గురువారం గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం రోడ్డుపై చీపురు చేతపట్టి చెత్తను ఊడ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులను శాలువా కప్పి సత్కరించారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలని ఆమె సూచించారు.
BDK: విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గురువారం వారి స్వగృహంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సతీసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మంత్రి పొంగులేటికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి అందరి జీవితాల్లో వెలుగు నింపాలన్నారు.
అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విజయదశమి సందర్భంగా గురువారం ఆయుధపూజను వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ స్వయంగా పాల్గొని, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా విధుల్లో ఉపయోగించే పోలీసు ఆయుధాలు, వాహనాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
NZB: పోతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీవాసులకు దసరా పండుగ రోజున కూడా తాగునీటి కష్టాలు తీరలేదు. మోటర్ కాలిపోయి ఐదు రోజులు అవుతున్నా పట్టించుకున్న అధికారే లేడని గ్రామస్తులు వాపోయారు. పంచాయతీ సెక్రెటరీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా అటువైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు. దీంతో గురువారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
MBNR: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరం కొనసాగిద్దామని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని దేవరకద్ర పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా అహింస మార్గాన్ని ఎంచుకున్న మహాత్మా గాంధీ ఎందరికో ఆదర్శ పురుషుడని అన్నారు.
RR: షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీలో విష్ణు సహస్ర పారాయణ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం తన వంతు సహాయంగా రూ. 25 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు.
AKP: అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయ్ కుమార్ గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అహింస మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహానీయుడు గాంధీజీ అన్నారు. ప్రపంచానికి గాంధీజీ ఆదర్శనీయం అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
JGL: మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా శోభాయమానంగా నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి అనేది చెడుపై మంచి గెలిచిన పర్వదినం, ధర్మం ఎప్పటికీ అధర్మపై గెలుస్తుందన్నారు.