• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవిగా అమ్మవారు దర్శనం

HYD: బల్కంపేట శ్రీ ఎల్లమ్మ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో గురువారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

October 2, 2025 / 08:53 PM IST

రావి ఆకుపై రావణ వధ చిత్రం

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ దసరా పండుగ సందర్భంగా శ్రీ రాముడు రావణాసురుడిని వధిస్తున్న చిత్రాన్ని రావి ఆకుపై రూపొందించాడు. చెడుపై మంచికి విజయంగా దసరా పండుగ స్ఫూర్తినిస్తుందని సందేశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని చూసి ప్రజలు బాస బాల్ కిషన్‌ను అభినందించారు.

October 2, 2025 / 08:52 PM IST

సొంత ఊరు దసరా వేడుకలో దిల్ రాజు

NZB: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సొంత గ్రామమైన నర్సింగ్ పల్లి గ్రామంలో వారు కట్టించిన గురువారం ఆలయం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఊరిలోని మిత్రులను బంధువులను అందరిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా రోజు తమ సొంత గ్రామమైన నర్సింగపల్లికి తప్పకుండా వస్తామని దిల్ రాజు అన్నారు.

October 2, 2025 / 08:52 PM IST

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా

RR: విజయదశమి పండుగను పురస్కరించుకొని వనస్థలిపురం శ్రీ గణేష్ ఆలయంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ అని అన్నారు.

October 2, 2025 / 08:51 PM IST

సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న జనం

MBNR: దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో ప్రత్యేక పూజలు చేసి స్థానికులతో ముచ్చటించారు. అనంతరం తన నియోజకవర్గంలోని కొడంగల్‌కు రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. మార్గ మధ్యలో మిడ్జిల్‌లో కాసేపు ఆగుతారనే సమాచారం మేరకు స్థానిక యువత, నాయకులు, పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.

October 2, 2025 / 08:48 PM IST

భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఏకంగా 103 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. అధికారుల సమక్షంలో ఆయుధాలు విడిచిపెట్టినవారిలో 23 మంది మహిళలూ ఉండగా.. వీరిలో 49 మందిపై మొత్తం రూ. కోటీ 6 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు పునరావస పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు.

October 2, 2025 / 08:48 PM IST

ముద్దసానమ్మ ఆలయంలో ఘనంగా దసరా పూజలు

ప్రకాశం: మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలసిన ముద్దసానమ్మ ఆలయంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు రూ.24,11,116 వేల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అందంగా అలంకరించారు.

October 2, 2025 / 08:48 PM IST

జన్నేపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి పూజలు

NZB: నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఎల్లమ్మ ఆలయంలో బాపిరాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ప్రతి కుటుంబంలో దైవచింతన ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం నవరాత్రి పర్వదినాల్లో దేశంలోనే శక్తి పీఠాలను సందర్శిస్తామని అన్నారు. దసరా రోజు బాసర సరస్వతిని దర్శించుకున్నామన్నారు. బాపిరాజు దంపతులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘనంగా సన్మానించారు.

October 2, 2025 / 08:46 PM IST

‘ప్రజలకు సుఖశాంతులు తేవాలి’

NRML: దసరా పండుగ ప్రజలకు సుఖశాంతులు తేవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధించిన రోజు దసరా అని పేర్కొన్నారు.

October 2, 2025 / 08:42 PM IST

శీతల దేవి సన్నిధిలో శమీ పూజలు

RR: SDNR నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలోని గోదా రంగనాయక స్వామి దేవాలయంలోగల శీతల దేవి సన్నిధిలో శమీ పూజలను నిర్వహించారు. పూజా కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించి రావణుడిని ఓడించాడని, పవిత్రమైన ఈ చెట్టును పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయించవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు.

October 2, 2025 / 08:41 PM IST

అశ్వ వాహనంపై శ్రీ సీతారాములు

SRCL: చందుర్తి కేంద్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా అశ్వ వాహనంపై శ్రీ సీతారామచంద్రమూర్తి గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ సందర్భంగా వేద పండితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు శమీ పూజను ఘనంగా నిర్వహించారు. జమ్మి కొమ్మకు పూజలు నిర్వహించి, అనంతరం ఒకరికి ఒకరు జమ్మి పంచుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

October 2, 2025 / 08:39 PM IST

‘అహింసా,సత్యం సేవా మార్గాలను అనుసరించాలి’

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ..మహాత్మా గాంధీ చూపిన అహింసా సత్యం,సేవా మార్గం వంటి సిద్ధాంతాలను అనుసరించాలన్నారు.

October 2, 2025 / 08:38 PM IST

వీరేశ్వర స్వామి ఆలయంలో శమి పూజ

కోనసీమ: విజయ దశమి మహపర్వదినం పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి జమ్మి వృక్షానికి శమి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని అమ్మవారి‌ని జమ్మి వృక్షం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. శమి శ్లోకంతో ప్రదక్షిణ జరిపారు, అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

October 2, 2025 / 08:37 PM IST

రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా: డీఎస్పీ

సత్యసాయి: తాడిమర్రిలో గురువారం రాత్రి గ్రామ సభ నిర్వహించారు. రౌడీషీటర్లు నేరప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ సూచించారు. సైబర్ క్రైమ్, భూతగాదాలు, మహిళలు చిన్నారులపై నేరాలపై అవగాహన కల్పించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

October 2, 2025 / 08:36 PM IST

సాయి బాబా ఆలయంలో దసరా వేడుకలు

HYD: విజయదశమి పర్వదినం రోజునే సాయిబాబా మహాసమాధి పొందిన విశిష్టతతో బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ విజయదశమి రావటంతో ఆలయాన్ని పూలు, దీపాలతో అద్భుతంగా అలంకరించి షమీ పూజ కార్యక్రమం కూడా ఘనంగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి బాబా ఆశీర్వాదాలు పొందారు.

October 2, 2025 / 08:36 PM IST