• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దామోదర్‌రెడ్డి మృతిపై రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి

ATP: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త అత్యంత బాధాకరమని, అతని పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గతంలో ఇరువురం మంత్రిగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు.

October 2, 2025 / 01:02 PM IST

గీతాశ్రమంలో ప్రత్యేక పూజలు

MNCL: జన్నారం మండలంలోని రోటిగూడ గీతాశ్రమంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజను నిర్వహించారు. జరిగాయి. దసరా పురస్కరించుకొని గురువారం గీతాశ్రమం ప్రధాన గురువు మాన స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి జమ్మి చెట్టుకు వారు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దసరా అన్నారు.

October 2, 2025 / 01:00 PM IST

సైబర్ నేరాల పట్ల ప్రమోత్తంగా ఉండాలి: ఎస్పీ

BHPL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP కిరణ్ ఖరే తెలిపారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల, వివిధ రకాల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశచూపి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్‌కు వచ్చిన OTP ఎవరికి చెప్పొద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే పోలీస్ స్టేషన్‌లో లేదా 1930కి కాల్ చేసి, కంప్లేంట్ చేయాలన్నారు

October 2, 2025 / 12:56 PM IST

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

BHNG: చౌటుప్పల్‌లో ఉన్న రాజీవ్ స్మారక్ భవనంలో గాంధీ, లాల్ బహాదుర్ శాస్త్రి జయంతిని గురువారం నిర్వహించారు. గాంధీ పార్క్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, రాజీవ్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎండీ ఖయ్యూం, నల్ల నరసింహ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుర్వి నర్సింహగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

October 2, 2025 / 12:55 PM IST

‘వైసీపీ హయంలో అరాచక పాలన’

ATP: అనంతపురంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ పార్థసారథి ఓల్డ్‌టౌన్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ అహింసా మార్గంతో స్వాతంత్రం సాధించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. గాంధీజీ కలల రాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోందని తెలిపారు. వైసీపీ హయంలో అరాచక పాలన సాగిందని విమర్శించారు.

October 2, 2025 / 12:54 PM IST

జాతిపిత ప్రపంచానికే ఆదర్శప్రాయం: ఎమ్మెల్యే

NLG: భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శప్రాయుడని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన మహనీయుడని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నకిరేకల్‌లోని వారి విగ్రహానికి ఎమ్మెల్యే గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు.

October 2, 2025 / 12:54 PM IST

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేయాలి: ఎర్రబెల్లి

JN: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. కాంగ్రెస్ బూటకపు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

October 2, 2025 / 12:51 PM IST

పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

JGL: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ అశోక్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, ఆర్ఐలు కిరణ్ కుమార్, సైదులు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొని మహాత్ముని సేవా స్ఫూర్తిని స్మరించారు.

October 2, 2025 / 12:50 PM IST

వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా షర్మిలారెడ్డి

E.G: వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) మెంబర్‌గా రాజమహేంద్రవరానికి చెందిన మేడపాటి షర్మిలారెడ్డి నియమితులయ్యారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఆమె రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(రూడా) ఛైర్మన్‌గా పని చేశారు. షర్మిలా రెడ్డి నియామకం పట్ల పార్టీలో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

October 2, 2025 / 12:45 PM IST

మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

KMM: చింతకాని గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ భాస్కర్ గౌడ్ గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. అహింస, సత్యం మార్గాల్లో నడిచి మనకు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అని గుర్తు చేశారు.

October 2, 2025 / 12:44 PM IST

మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

GNTR: మహాత్మా గాంధీ జయంతిని ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రవిబాబు మాట్లాడుతూ శాంతి, సహనం, సత్యం, అహింస అనే విలువలతోనే గాంధీ జీవితం సాగింది అని తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

October 2, 2025 / 12:44 PM IST

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

PPM: కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన గిరిజన విద్యార్థులను ఇవాళ స్థానిక శాసనసభ్యులు తోయక జగదీశ్వరి పరామర్శించారు. వైద్యలుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ఏ విధమైన వైద్యం అందుతుందో అడిగి తెలుసుకున్నారు.

October 2, 2025 / 12:41 PM IST

విజయవాడ లో “స్వచ్ఛతాన్ 10కే మారథాన్” కార్యక్రమం

NTR: విజయవాడ ఎంజీ రోడ్‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాన్ 10కే మారథాన్” గురువారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ సినీ హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రజలు శుభ్రతలో ఆదర్శంగా నిలవాలని కోరారు. యువత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

October 2, 2025 / 12:41 PM IST

ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి పొన్న ప్రభాకర్ దంపతులు

SDPT: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ MLA క్యాంపు కార్యాలయంలో ఘనంగా శమీ పూజ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సతీసమేతంగా కార్యాలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించి, అనంతరం ఆయుధాలకు పూజలు చేశారు.

October 2, 2025 / 12:41 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లింగేశ్వర్ యాదవ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరమర్శించారు. ఆరోగ్య స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం తీసుకోవాల్సిందిగా సూచించారు.

October 2, 2025 / 12:40 PM IST