NLR: ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు కావలి ట్రంక్ రోడ్డులోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
GNTR: గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనుంది. నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ ఛైర్మన్ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజ్జనగుండ్ల చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లను పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ గురువారం పర్యవేక్షించారు.
కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లు, అల్ట్రా సౌండ్ కేంద్రాలను డీఎంహెచ్‌వో అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ బృంద సభ్యులతో కలిసి నిన్న తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ & నర్సింగ్ హోమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ధర్మారం, అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, ముత్తారం, మంథని మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DPO వీర బుచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన నూతన సర్పంచులకు సూచించారు.
కృష్ణా: ఈనెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్ టికెట్లను నిన్న పంపిణీ చేశారు. కళాశాల ఇంఛార్జ్ సుధాకర్ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సుకు చెందిన 98 మంది, వృత్తి విద్య కోర్సుకు చెందిన 60 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
RR: షాద్‌నగర్ పట్టణ పదవ వార్డు కౌన్సిలర్ శ్రావణిని సీఎస్కే విల్లాస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతానన్నారు.
KRNL: దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో రేపు ఉదయం 11 గంటలకు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జ్యోతి ఇవాళ తెలిపారు. అన్నిశాఖల అధికారులు ప్రగతి నివేదికలతో రావాలని సూచించారు. అలాగే.. సమావేశానికి ప్రజాప్రతి నిధులు హాజరు కావాలని కోరారు.
ELR: పెదవేగి మండలంలోని కూచింపూడి విద్యుత్ ఉపకేంద్రం RDSS పథకం లైన్లు మెరుగుదల పనుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. YSR బొమ్మ రోడ్డు, శూద్ర వారి మెట్టా, నాలుగు పంచాయతీ బోర్లు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
ASR: జీ.మాడుగుల మండలం గన్నేరుపుట్టులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పాంగి సీతన్న, చిన్నమ్మి, భీమన్న, మఠం రాంబాబు అనే రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఉన్న కాఫీ, మిరియాల తోటల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
అఫ్గనిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ నిన్న కెనడాపై 4/7 ప్రదర్శనతో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ICC ఈవెంట్స్(T20 లేదా ODI)లో అత్యధికంగా 41 ఏళ్ల 49 రోజుల వయసులో 4 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అఫ్గన్ తరఫున 152 T20 మ్యాచులాడిన నబీకి పొట్టి ఫార్మాట్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ క్వశ్చన్ అవర్‌తో శాసన మండలిలో బడ్జెట్ సెషన్స్ ప్రారంభంకానున్నాయి. 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సెషన్‌లో బడ్జెట్ ప్రసంగంపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానాలు చెప్పనున్నారు. అనంతరం శాసనసభ ఆమోదించిన 7 బిల్లులను ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టనుంది.
NRML: వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం వేలం వేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. ఈ వేలం పాట నిర్మల్‌లోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు హాజరై వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
E.G: ఉండ్రాజవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్ర, శనివారాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ నిడదవోలు ఎస్ఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలివెన్ను, కాల్దరిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
KRNL: జిల్లా కలెక్టర్ ఎ. సిరి గురువారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు గృహ గణన చేపడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో మే 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు గృహ గణన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంది.
కోనసీమ: ముంగండ ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది.