VZM: గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గజపతినగరం జడ్పీటీసీ గార తవుడు మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావులు గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇందులో వైసీపీ నేతలు బెల్లాన త్రినాధరావు, లక్ష్మనాయుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గంలో కొలువుతీరి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి తరఫున గురువారం సారె సమర్పించారు. ఆలయ నూతన ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు, ఆలయ అర్చకులు ఈ సారె సమర్పించారు.
ATP: రాయదుర్గం పట్టణంలో బస్టాండ్ సమీపాన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయ దిశగా ముందుకెళ్దాం అని సూచించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కోనసీమ : ఐ. పోలవరం మండలం పశువులంకకు చెందిన చీటీల వ్యాపారి వీర శంకర్రావు అతని కుమారుడు మౌనిష్‌ను పోలవరం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. దీంతో కోర్టు వారు ఇరువురికీ 15 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
MDK: నిజాంపేట మండల కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సత్యమేవ జయతే ఆయుధంగా ఆహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛను అందించిన జాతిపిత అని కొనియాడారు.
కోనసీమ: వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అల్లవరానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధను నియమించినట్లు ఆమె గురువారం మీడియాకు తెలిపారు. అనురాధ మాట్లాడుతూ.. ఈ పదవిని బాధ్యతగా తీసుకుని వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
NZB: ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలో నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం గాంధీ జయంతి గాంధీ చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ అహింసా మార్గంలో నడిచి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగోళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
PPM: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొమ్మాలి భాను, ఎంపీడీవో మురళీధర్ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, జూనియర్ అసిస్టెంట్ కిషోర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
AKP: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో అనకాపల్లికి రాష్ట్ర, జిల్లాస్థాయిలో అవార్డులు లభించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ మేరకుసీఎం చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా అవార్డులను ప్రకటించినట్లు గురువారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఐదు అంశాల్లోనూ, జిల్లాస్థాయిలో 45 అంశాల్లోనూ అవార్డులు వచ్చాయన్నారు. ఈనెల 6న జిల్లా ఇంఛార్జ్ మంత్రి అవార్డులు అందజేస్తారన్నారు.
RR: హయత్‌నగర్ డివిజన్‌లో గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. కోట్లాది భారతీయులకు గాంధీ స్వేచ్ఛ, స్వతంత్రన్ని అందించారన్నారు.
GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ టి.శ్రీనివాస రావు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస అనే సిద్ధాంతాలతో దేనినైనా సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు.
MDK: రామాయంపేట మండలం ప్రజలందరూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలు మద్యం మాంసంకు దూరంగా ఉండాలని తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. దసరా పండుగ సందర్భంగా మాట్లాడుతూ.. మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నిమజ్జనం వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు.
ELR: జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. జీఎస్టీ తగ్గింపును పురస్కరించుకొని గురువారం భీమడోలు గ్రామంలో ఆప్కాబ్ ఛైర్మన్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటరులో జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు కరపత్రాలు పంచుతూ వివరించారు.