• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

WGL: వద్దన్నపేట విజయదశమి పర్వదినం సందర్భంగా కట్రీయాల గ్రామంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య పాల్గొని పూజలు చేశారు. గ్రామ పెద్దలు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

October 2, 2025 / 06:16 PM IST

RTC అధికారులతో మంత్రి పొన్నం టెలీకాన్ఫరెన్స్

TG: దసరా సందర్భంగా సొంతూర్లకు వెళ్లిన ప్రజలకు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా RTC చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. RTC ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి బస్ స్టేషన్‌లో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.

October 2, 2025 / 06:16 PM IST

చిత్తూరులో రోడ్డు పరిశీలించిన కలెక్టర్

CTR: చిత్తూరు రైల్వేపై వంతెన కింది భాగంలోని రహదారులను సుందరీకరణ చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక నేతల వినతి మేరకు.. కలెక్టర్, MLA గురజాల జగన్ మోహన్ రైల్వే వంతెన కింద రోడ్డును పరిశీలించారు. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్న ఈ రోడ్డు వంతెన కింది భాగాలకు 2 వైపులా సుందరీకరణ పనులు చేపట్టారు.

October 2, 2025 / 06:15 PM IST

తునికిలో నల్ల పోచమ్మకు విశేష పూజలు

MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కొలువుదీరిన శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున అభిషేకం, కుంకుమార్చన, ఒడి బియ్యం సమర్పించినట్లు ఆలయ ఈవో రంగారావు తెలిపారు. పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయంలో సందడి నెలకొంది.

October 2, 2025 / 06:15 PM IST

పెద్దమ్మ తల్లి ఆలయంలో కవిత పూజలు

HYD: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని కలిగి ఉండాలన్నారు.

October 2, 2025 / 06:12 PM IST

రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాలు

PLD: క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాల కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా ఎడ్ల పందేలు మన సాంప్రదాయాన్ని, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

October 2, 2025 / 06:11 PM IST

గంగమ్మ హోమంలో పాల్గొన్న కమిషనర్ మౌర్య

TPT: తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో గురువారం విజయదశమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పూర్ణాహుతిని సమర్పించారు. కమిషనర్ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

October 2, 2025 / 06:10 PM IST

వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం

KDP: సిద్దవటం మండలం సి. కొత్తపల్లిలో గంగమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారిని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లికార్జున అనే వ్యక్తి రూ. 5 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

October 2, 2025 / 06:09 PM IST

వాగులో అమ్మవారి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

NZB: బోధన్ మండలం చిన్న మావంది పెగడపల్లి మధ్యలో గల వాగులో అమ్మవారి నిమజ్జనం చేయడానికి సార్వజనిక్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తహసీల్దార్ విట్టల్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, ఎస్సై మచ్చేందర్ రెడ్డితో కలిసి సార్వజనిక్ సభ్యులు కందకుర్తిని సందర్శించారు. శుక్రవారం అమ్మవారి నిమజ్జనం పెగడపల్లి-చిన్నమావంది మధ్య వాగులో జరుగుతున్నారు.

October 2, 2025 / 06:08 PM IST

కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం

ప్రకాశం: కుల వివక్ష పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ హనుమంతునిపాడులో కేవీపీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కేవీపీఎస్ సీనియర్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనగారిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కుల వివక్షతకు వ్యతిరేకంగా KVPS పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

October 2, 2025 / 06:06 PM IST

ఉస్మానియా యూనివర్సిటీకి వరస సెలవులు

HYD: OUలో వరుసగా 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఇందులో 3 ప్రభుత్వ సెలవులు కాగా.. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.జి.నరేశ్ రెడ్డి సెలవులు ప్రకటించారు. ఇవాళ విజయ దశమి, శుక్రవారం ఫాలోయింగ్ డే, 5న ఆదివారం కాగా సెలవుదినాల మధ్య మధ్యలో 4న శనివారం వర్కింగ్ డే వచ్చింది. దీంతో ఆ రోజును సెలవుగా ప్రకటించి, ఈనెల 8న రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంది.

October 2, 2025 / 06:06 PM IST

పేరుపాలెం బీచుకు పోటెత్తిన పర్యాటకులు

W.G: విజయదశమి పండుగ, సెలవు కావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్ పర్యాటకులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులు కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు చేస్తూ, ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. పర్యాటకుల వాహనాలతో బీచ్ రోడ్డు మొత్తం రద్దీగా మారింది.

October 2, 2025 / 06:06 PM IST

దుర్గామాతను దర్శించుకున్న SC,ST కమిషన్ సభ్యుడు

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని బుడిదగడ్డ బస్తీలో గల దుర్గామాత మండపాన్ని రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ దంపతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిత్యం సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు.

October 2, 2025 / 06:04 PM IST

క్రిటికల్ కేర్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BPT: చీరాలలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.23.75 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రికి మంజూరు చేసిన యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

October 2, 2025 / 06:02 PM IST

రాత్రి 10 తర్వాత 144 సెక్షన్

KNR: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దుర్గామాత నిమజ్జన కార్యక్రమాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటలలోపు నిర్వహించాలని చొప్పదండి ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. రాత్రి 10 గంటల తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అర్ధరాత్రి సమయంలో ఎటువంటి ఊరేగింపులకు అనుమతులు లేవని, ప్రజలు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు.

October 2, 2025 / 06:01 PM IST