• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రీ ఫేజ్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

February 22, 2026 / 03:50 PM IST

తోట కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

కోనసీమ: రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట రాము సోదరుడు తోట సత్యనారాయణ కుటుంబాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి కూడా తీరని లోటు అని అన్నారు.

February 22, 2026 / 03:50 PM IST

శర్వానంద్ సినిమా కోసం మ్యూజిక్ కసరత్తులు

హీరో శర్వానంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల ఓ మూవీని తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్‌పై పని జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు టాక్. ముందుగా శర్వా లేని సీన్స్‌ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 03:50 PM IST

వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

WNP: వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల కన్నా తక్కువ ధరలకు బస్సులు వస్తాయని డ్రైవర్ బత్తా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు. వివరాలకు 7995701851,9676563377 నంబర్లను సంప్రదించాలని కోరారు.

February 22, 2026 / 03:48 PM IST

ఇకనుంచి సత్వర విద్యుత్ సేవలు

TG: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తన వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. విద్యుత్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే వివిధ సేవలను పొందవచ్చు.

February 22, 2026 / 03:46 PM IST

కామారెడ్డి: ఈనెల 24న మైనార్టీ కమిషన్ ఛైర్మన్ రాక

KMR: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారీక్ అన్సారీ ఈనెల 24న జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో కలిసి మైనార్టీ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రతో భేటీ అవుతారని జిల్లా ఉన్నత అధికారులు తెలిపారు. మైనార్టీల సమస్యలు, వారి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష జరుపుతారు.

February 22, 2026 / 03:45 PM IST

మచిలీపట్నంలో మాజీ సీఎం రోశయ్య విగ్రహావిష్కరణ

కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవన్‌లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి డా. కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య సేవలను వారు కొనియాడారు.

February 22, 2026 / 03:45 PM IST

ప్రశాంతంగా ముగిసిన గురుకులం ప్రవేశ పరీక్ష

WGL: వరంగల్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి కాగా 6వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం 9 కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించినట్లు DCO పి. అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,744 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 94.67గా నమోదైనట్లు వెల్లడించారు.

February 22, 2026 / 03:44 PM IST

మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపిన సర్పంచ్

BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ లలిత ప్రజల సౌకర్యార్థం మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపించారు. ఆదివారం గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మంచినీటికి కొత్త పైపులైన్లు వేయించారు. వారు మాట్లాడుతూ.. రానున్న ఎండాకాలం దృశ్య నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 03:43 PM IST

గోపాలపురం కాలనీల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని పలు కాలనీలలో రూ. 4.5 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణితో కలిసి పాల్గొన్నారు. కాలనీలలో మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

February 22, 2026 / 03:43 PM IST

YCP హిందువుల మనోభావాలు దెబ్బతీసింది: బొజ్జల

AP: శ్రీకాళహస్తిలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. YCP MLAలు, MLCలు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. YCP హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని MLA బొజ్జల సుధీర్ పేర్కొన్నారు. లడ్డూలోనే ఇంత స్కామ్ జరిగిందంటే ఇతర అంశాల్లో ఇంకెంత అవినీతి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలని చంద్రబాబు, పవన్, లోకేష్‌ను కోరుతున్నామని తెలిపారు.

February 22, 2026 / 03:43 PM IST

ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ శిక్షణ శిబిరం

NZB: మగ్గిడి పాఠశాలలో 12 రోజులుగా సాగుతున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలు, 14 మంది బాలురను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈనెల 24 నుండి మార్చి 1 వరకు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో జరగనున్న జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు.

February 22, 2026 / 03:42 PM IST

మంతన్డ్లో ఉచిత వైద్య శిబిరం

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కీళ్ల నొప్పులు, పక్షవాతం, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాజేందర్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ శిబిరానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

February 22, 2026 / 03:42 PM IST

‘మానసిక ప్రశాంతత కోసం హ్యాపీ సండే’

శ్రీకాకుళంలోని బలగమెట్టు సమీపంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు ఆధ్వర్యంలో ఆదివారం “హ్యాపీ సండే” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. నగరాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న మున్సిపల్ అధికారుల మానసిక ప్రశాంతత కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు.

February 22, 2026 / 03:41 PM IST

BRS నేతలు విషం చిమ్ముతున్నారు: బల్మూరి

TG: మూసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు, BRS నేతలు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్‌ MLC బల్మూరి వెంకట్‌ విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతం శుభ్రపడితే HYD ప్రజలు ఎప్పటికీ CM రేవంత్‌ను గుర్తుపెట్టుకుంటారనే భయం BRS నేతల్లో ఉందన్నారు.

February 22, 2026 / 03:41 PM IST