• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ టోర్నీలో విద్యార్థిని ప్రతిభ

NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బుర్రా రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ఆడి విజయం సాధించారని HM సాయన్న తెలిపారు. బుష్త్రాను, ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యా యుడు నాగభూషణంను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, పాలుగోన్నారు.

February 25, 2026 / 08:07 AM IST

రాష్ట్ర ప్రభుత్వ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ, ఇతర అధికారులతో కలిసి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధునికంగా రూపొందించిన 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారంతో కూడిన ఈ క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని కలెక్టర్ సమాచార, పౌర సంబంధాల అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 08:07 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాల కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246, మోడల్ స్కూల్/కళాశాల కేంద్రంలో 219 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. హాల్టికెట్ నంబర్లను బెంచీలపై సిద్ధం చేశారు.

February 25, 2026 / 08:07 AM IST

‘బంగినపల్లి’ మామిడికి భలే డిమాండ్

AP: మామిడి రైతులకు అదృష్టం వరించింది. కవర్లు తొడిగిన బంగినపల్లి మామిడి టన్ను ధర రూ.1.80 లక్షలు, తోతాపురి రూ.లక్ష పైనే పలుకుతోంది. ప్రభుత్వం కవర్లకు 50% సబ్సిడీ ఇవ్వడంతో ఎక్కువ మంది రైతులు ముందుకొస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత రెట్టింపయ్యిందని, తెగుళ్లు, పక్షులు, జంతువుల నుంచి రక్షణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.

February 25, 2026 / 08:05 AM IST

ప్రమాదాల నివారణకు పోలీసుల ‘ఫేస్ వాష్’ కార్యక్రమం

BPT: పిట్టలవానిపాలెం మండల హైవేలపై ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో ఉన్న వాహన డ్రైవర్లను ఆపి, వారి ముఖాలు కడిగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలసట, నిద్ర కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

February 25, 2026 / 08:04 AM IST

మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

AKP: జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అప్పారావు నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 125 పరీక్ష రుసుము చెల్లించాలన్నారు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

February 25, 2026 / 08:03 AM IST

బైక్ అదుపుతప్పి కార్మికుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గంగమ్మ గుడి వద్ద స్పీడ్ బ్రేకర్‌పై బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 08:02 AM IST

KTR వ్యాఖ్యలపై NSUI జిల్లా అధ్యక్షుడు ఆగ్రహం

ASF: ఆసిఫాబాద్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో విప్ ధిక్కరించి ఓటు వేసిన కాంగ్రెస్ కౌన్సిలర్‌కు మాజీమంత్రి KTR హామీ ఇవ్వడంపై NSUI జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్టంపై ఇప్పుడు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలన్నారు.

February 25, 2026 / 08:02 AM IST

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య: రూపేష్ రెడ్డి

ADB: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయటం జరుగుతుందని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ అన్నారు. నిన్న బేల మండలం సాంగిడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 5 లక్షల 40 వేల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సర్పంచ్ భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 08:02 AM IST

రెండు కేసుల్లో యువకుడికి జైలు శిక్ష

SKLM: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన రెండు వేర్వేరు కేసుల్లో పెద్దపాడుకి చెందిన కె.రాము అనే యువకుడికి జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంగళవారం తీర్పు వెల్లడించారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయ ఓ ప్రకటనలో తెలిపారు. ముద్దాయికి ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

February 25, 2026 / 08:01 AM IST

విందులో స్పీకర్ ప్రసాద్ కుమార్

VKB: మర్పల్లి మండలంలోని మజీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్పికర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ముస్లింలకు ఖర్జూర తినిపించి ఉపవాస దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ఉదవాసాలు ప్రజలందరికి మంచి జరిగేలా ఉండాలని కోరుకున్నారు.

February 25, 2026 / 08:00 AM IST

తాడిపత్రిలో రెండు ముక్కలైన ట్రాక్టర్

ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ భాగాలు రెండుగా విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని సేఫ్టీ బెలూన్లు (ఎయిర్ బ్యాగులు) తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

February 25, 2026 / 08:00 AM IST

‘కళ్యాణదుర్గం నుంచి ఆర్‌అండ్‌బీ కార్యాలయం తరలింపు తగదు’

ATP: కళ్యాణదుర్గంలోని ఆర్‌అండ్‌బీ డివిజనల్ కార్యాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లాకు తరలించడం సరికాదని YCP జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హిందూపురానికి ఆర్‌అండ్‌బీ సిబ్బందిని, కార్యాలయాన్ని తరలించవద్దని ఆయన డిమాండ్ చేశారు.

February 25, 2026 / 08:00 AM IST

విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి: ఏఈ

KKD: విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సహకరించాలని ఆ శాఖ ఏఈ మాధురి కోరారు. జగ్గంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం లైన్మెన్ శివప్రసాద్, సిబ్బందితో కలసి బకాయిలు ఉన్న ఇళ్లకు వెళ్లి వసూలు కార్యక్రమం చేపట్టారు. నెలలు తరబడి బిల్లులు చెల్లింపులు చేయని పలు కనెక్షన్లు నిలుపుదల చేసినట్లు ఆమె తెలిపారు.

February 25, 2026 / 08:00 AM IST

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్

KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నిర్వహించిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. డోన్ గవర్నమెంట్, పత్తికొండ రాఘవేంద్ర డిగ్రీ కాలేజీల్లో జరుగుతున్న సెంటర్లలో ఒక్కొక్కరు చొప్పున డిబార్ అయ్యారు. అటు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 89 శాతం మంది, బీటెక్ పరీక్షకు 98 శాతం, లా పరీక్షలకు 92 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

February 25, 2026 / 08:00 AM IST