KKD: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ కోరారు. పెద్దాపురం మండలం గోరింటలో మంగళవారం కలెక్టర్ రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు. ప్రజల భూ సమస్యలను వీటి ద్వారా పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజు, అధికారులు పాల్గొన్నారు.
SRCL: జిల్లా కొనరావుపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగురి రంజిత్ గారు మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
AP: అధికారం కోసం పార్టీ మారలేదని బీద మస్తాన్‌రావు అన్నారు. ప్రజలు తిరస్కరించిన వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. బీసీ నేతగా గుర్తించి టీడీపీ రాజ్యసభకు పంపుతోందన్నారు. రాష్ట్ర భవిష్యత్ చంద్రబాబుతోనే ముడిపడి ఉందని చెప్పారు. 42 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో 39 ఏళ్లు టీడీపీలోనే ఉన్నానని.. ఇక భవిష్యత్ టీడీపీతోనేనని స్పష్టం చేశారు.
ELR: ఈనెల 13, 14, 15వ తేదీల్లో బుట్టాయిగూడెంలో జరుగుతున్న సీపీఎం 25వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ కోరారు. మంగళవారం పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనం వద్ద సీపీఎం 25వ జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. 13వ తేదీన బుట్టాయిగూడెంలో సీపీఎం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.
MNCL: నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్లు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణ, నీతి, నిజాయితితో విధులు నిర్వర్తించాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కమీషనరేట్ కార్యాలయంలోని సమావేశ హల్‌లో ఎఆర్ పోలీసు విధులు, క్రమశిక్షణ, తదితర అంశాల గురించి దిశానిర్దేశం చేశారు. ఇతర శాఖల విధులతో పోలిస్తే పోలీసు డ్యూటీ సవాళ్లతో కూడినదని పేర్కొన్నారు.
KRNL: శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు స్థానిక సత్రాలవారితో సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అన్ని సత్రాలు కూడా సేవాదృక్పథంతో భక్తులకు సేవలు అందించాలన్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, భక్తుల సదుపాయాల కల్పనలో అన్ని సత్రాల వారు కూడా సహకరించాలన్నారు. సత్ర ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
MNCL: మంచిర్యాల జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయంలో మంగళవారం టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులకు టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివప్రసాద్, పట్టణ అధ్యక్షులు నాగుల గోపాల్, నాయకులు రోశయ్య, సంపత్, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
VZM: విజయనగరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ జి.పగడాలమ్మ చెప్పారు. దృశ్యకళా పోటీలలో నెల్లిమర్ల ఎంజెపి విద్యార్థిని పి సౌజన్య మణి ప్రథమ స్థానం సాధించింది. వాద్యా సంగీత పోటీలలో బిఎ శివాత్మిక ప్రథమం స్థానం కైవసం చేసుకున్నట్లు చెప్పారు.
TG: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. దీంతో వివిధ శాఖల అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.
KMM: సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మంగళవారం ఎమ్మెల్యే రాగమయి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే, అభివృద్ధి కార్య క్రమాలపై మంత్రి పొంగులేటితో ఎమ్మెల్యే చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ATP: రైతుల సమస్యలు పరిష్కరానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం మండలం కామారుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆర్డీవో కేశవ నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వాకంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
GNTR: పొన్నూరు MPDO కార్యాలయం నందు 2014-2019 కాలంలో టీడీపీ హయంలో నిర్మించిన శ్రీశక్తి భవనాన్ని మంగళవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు నిర్మించిన పంచాయతీరాజ్ భవనాన్ని పరిశీలించి జరిగిన పనులను, చేయాల్సిన పనులు గురించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
GNTR: ఏపీ నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్ కృష్ణయ్య గెలుపు లాంఛనమేనని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయనను కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. బీసీల ఆత్మగౌరవం నిలిపిన నాయకుడు, వారి హక్కుల కోసం పోరాటం ఢిల్లీ స్థాయిలో చేసిన ఆర్ కృష్ణయ్య విజయం అందరి విజయం అన్నారు.
AP: పార్టీ మారిన ఇద్దరిని రాజ్యసభకు పంపారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు తమ మంత్రిపై నమ్మకం లేక కాకినాడ వచ్చారని అన్నారు. ‘కొందరు ఎమ్మెల్సీలు అమ్ముడుపోయి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నా. తాము తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి. మీరే అధికారింలో ఉన్నారు కదా’ అని పేర్కొన్నారు.
SRCL: ప్రభుత్వ నిర్మాణ, స్థానిక, వాణిజ్య అవసరాలకు ఇసుక రీచ్‌లు గుర్తించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ శ్యాండ్ కమిటీ మీటింగ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఓ నెంబర్ 3, టీజీ ఎం.డీ.సీ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు.జిల్లాలో ఎన్ని ఇసుక రీచ్ లు ఎన్ని ఉన్నాయో ఆరా తీశారు.