KNR :హనుమాన్ నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి SGF జోనల్ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. నగర శివారులోని మల్కాపూర్లో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ మండలస్థాయి అండర్- 14 క్రికెట్ పోటీల్లో బుర్ర మణి జ్యోతిక్(9వ తరగతి) ఎంపిక పట్ల పాఠశాల ఛైర్మన్ ఆనందం వ్యక్తం చేసి విద్యార్థికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
Jgl: మల్యాల మండలం పోతారం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో ఏఓ చంద్రదీపక్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100%, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ కల్పిస్తుందని తెలిపారు. అంతర్ పంటల సాగుకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ. 4200 చొప్పున 4 సంవత్సరాలు రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుందన్నారు.
KMM: వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నేడు పర్యటిస్తున్నట్లు జూలూరూపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ తెలిపారు. మధిర రోడ్‌లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసితో కలిసి ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మీ దాంపత్య మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులచే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
NTR: మైలవరం నియోజకవర్గం జీ. కొండూరు మండలం పినపాక గ్రామపంచాయతీ నందు Theme 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం జరిగినది. ఇందులో భాగముగా గ్రామానికి MPDO, Dy MPDO, జీ. కొండూరులోని అన్ని పంచాయతీల కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, హెల్త్ వర్కర్‌లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడం జరిగింది.
PDPL: ఆయిల్ ఫాం పంట సాగుతో రైతుల ఇంట సిరుల పంట పండుతుందని మంథని సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఉద్యాన వన, వ్యవసాయ, సహకార శాఖ, సహకార సంఘం, తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో అవహగాహన సదస్సు నిర్వహించారు.
PDPL: మంథని మాతాశిశు ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపరిండెంటెండ్ ప్రత్యేక చొరవతో గైనిక్ సేవలను పునః ప్రారంభించారు. గర్భిణీలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా డబ్బులు వృధా చేసుకోకుండా మంథని పరిసర ప్రాంతాల గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీధర్ కోరారు.
NTR: కొండపల్లి పట్నంలోని ‘బీ’ కాలనీ వద్ద గల సెయింట్ థామస్ మందిర మందిర పునః ప్రతిష్ట ఉజ్జీవ సభ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TDP రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసుప్రభు సూచించిన సన్మార్గం సర్వ మానవాళికి ఆదర్శమని అన్నారు.
JGL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వెల్గటూర్ మండలంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని పాశిగామ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను కలిసి వారి అవసరాలు, పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామన్నారు.
KMR: అంతర్‌రాష్ట్ర దొంగ నోట్ల తయారీ, చలామణి చేసిన ముఠాకు చెందిన నిందితుడు లఖన్ కుమార్‌పై కామారెడ్డి జిల్లా పోలీసులు PD యాక్ట్‌ను అమలు చేశారు. కామారెడ్డి టౌన్ PSలో రెండు నకిలీ రూ. 500 నోట్ల వినియోగంపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలలో ఆపరేషన్ నిర్వహించి, మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
KNR: జమ్మికుంట మార్కెటు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 659 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా, గరిష్ఠంగా రూ. 7,100, కనిష్ఠంగా రూ.6,200 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ. 6,400 పలికింది.
KNR: ముల్కనూర్ మోడల్ స్కూల్లో నెస్లే కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా నిర్మించిన బయో మాడ్యులర్ టాయిలెట్లను జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్, ఎంఈఓ పావని, నెస్లే కంపెనీ బాధ్యులు వసీం తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: దక్షిణ అండమాన్‌లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.
ప్రకాశం: వెలిగండ్ల(M) రాళ్ళపల్లి ఇమ్మడి చెరువు రహదారిలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కండ్రిక కొత్తపల్లి గ్రామానికు చెందిన కొండారెడ్డి బైక్‌పై వస్తూ సైడ్‌లో ఆపిన బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగింది. ప్రథమ చికిత్స తర్వాత 108 వాహనంలో కనిగిరి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.