AKP: మాడుగుల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీసే విధంగా పని చేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో మారెమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సతీమణి ఎం.ఎస్. ఉమాదేవి పాల్గొన్నారు. గ్రామ మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
W.G: పాలకొల్లులోని ప్రధాన కాలువలోకి దశాబ్దాలుగా చెత్తాచెదారం చేరుతోందని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దిగువ గ్రామాల సర్పంచులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ వదిలేసిన మురుగు పంట కాలువల్లో కలిసి తమ గ్రామాలకు వస్తోందని, తాము విషం తాగుతున్నామంటూ గత మండల సర్వసభ్య సమావేశాల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు.
AP: పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేలా కేంద్రంతో ప్రభుత్వం సహకార ఒప్పందం చేసుకుంది. 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టనుంది. తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, రెండోదశలో 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పూర్తి చేయనుంది. కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది.
MLG: మంగపేట మండలం లక్ష్మీనర్సాపురం గ్రామంలో వైభవంగా జరిగే శ్రీ నాగులమ్మ జాతర మహోత్సవాలకు రావాలని మంత్రి సీతక్కకు ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి ఆదివారం ఆహ్వానపత్రం అందజేశారు. వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన నాగులమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మంత్రికి తెలిపారు. మంత్రి జాతరకు వస్తానని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికార యాప్ MYTDP పోస్టర్‌ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్యా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మౌర్యా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ MYTDP యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలని పిలుపునిచ్చారు.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WGL: నర్సంపేట (M) నర్సింగాపురం–ఇటుకలపల్లి GP రైతుల ఆధ్వర్యంలో DC–33 ఎల్‌ఎంసీ కెనాల్ కాలువను ఇవాళ రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా TG రైతు కూలి సంఘం (D) కార్యదర్శి పైడి మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్యాకేజీలో భాగమైన డీసీ–33 ఎల్‌ఎంసీ కెనాల్ కాల్వ పనులు అధికారుల నిర్లక్ష్యం వలన ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించాలి.
HYD: తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావును అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీజేపీ మేడ్చల్ అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఖండించారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
NGKL: కుమ్మెర గ్రామంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులతో కలిసి కుమ్మెర గ్రామంలో ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా దాడి చేసి గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
KNR: CPI సీనియర్ నాయకుడు, మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీరాముల రామచంద్రం ప్రమాదవశాత్తు మృతిచెందడం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు. ఆదివారం కొండపల్కల గ్రామంలోని రామచంద్రం నివాసానికి చేరుకున్న ఆయన రామచంద్రం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
KMR: గాంధారిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 24 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు సుధాకర్, నర్సోజీ, వెంకటయ్యలను ఘనంగా సన్మానించారు. చెన్నకేశవులు, రాజు, నందం తదితర విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.
విశాఖ అన్నంరాజునగర్‌లోని శ్రీ అష్టలక్ష్మీ దేవాలయాన్ని ఆదివారం రష్యా దేశస్తులు సందర్శించారు. భారతదేశంలోని ప్రముఖ ఆలయాలపై అధ్యయనం చేస్తున్న భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయంలో శివకేశవుల విగ్రహాల నిర్మాణం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా వీణ ధరించిన అమ్మవారి రూపం తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ‘PGRS’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
AP: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఏబీపీ అమలుకు రూ.2,432 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఏబీపీ కోసం ఏపీబీఐఎల్ పేరుతో ఎస్‌పీవీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి-ఏపీ అంగీకారంతో నిధులిచ్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు చేపట్టనుంది.