SRD: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహరూపు రేఖలు మార్చడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
NLR: కొడవలూరు మండలంలోని మానే గుంటపాడులో మంగళవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల దగ్గర నుంచి మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి అర్జీలను స్వీకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఇవాళ మంత్రి నారా లోకేశ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంత్రి లోకేశ్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రితో కలిసి ఫోటో దిగారు. మంత్రి లోకేశ్‌ను కలవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఎమ్మెల్యే అన్నారు.
AP: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించనట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని చెప్పాడం సరికాదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ఏపీ ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనమని ధ్వజమెత్తారు. కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు.. విభజన చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని ధ్వజమెత్తారు.
NLG: దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 4500 కోట్లను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్డీఓకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
SRD: మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించి ఇంట్లో కుటుంబ పోషణ కూడా చూసుకోవడంతో ఒత్తిడికి గురవుతారని చెప్పారు. వీరికోసమే అవగాహన సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కోనసీమ: గుంటూర్‌లో డిసెంబర్ 15వ తారీఖున జరిగే మాలల మహాసభకు రాజోలు నియోజకవర్గం నుండి మాలలు వేలాదిగా తరలిరావాలని దళిత ఐక్య వేదిక కన్వీనర్ ఇసుకుపట్ల రఘుబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనం సభ రాజోలు జేఏసీ అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సభకు అందరూ హాజరు కావాలన్నారు.
HNK: జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్‌లో నేడు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు. వరంగల్ నగరంలో ఇటీవల కాలంలో పోలీసులు పట్టుకున్న సైలెన్సర్లను సీపీ అంబర్ కిషోర్ ఝ ఆదేశం మేరకు రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సైలెన్సర్లను నాశనం చేశారు.
NLG: భూవివాదంతో సోదరుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన తిప్పర్తి మండలంలో జరిగింది. మండలంలోని మామిడాలకి చెందిన గజ్జి లింగయ్య, చంద్రయ్య అన్నదమ్ములు. ఇరువురి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ రోజు లింగయ్య, చంద్రయ్య కుమారులు గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కృష్ణా: నందిగామలో మంగళవారం మహిళా సాధికారత కింద మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందించారు. ఏపీ లయన్స్ సేవా యజ్ఞంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ అధ్యక్షుడు మందడపు సీతారామయ్య అధ్యక్షతన రైతుపేట రామకృష్ణ ప్లాజాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ సభ్యులు డాక్టర్ యర్రంరెడ్డి గాంధీ, డాక్టర్ పులి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
KMM: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ జాతీయ సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ..ఆదానీ అవినీతిపై పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టాన్ని మణిపూర్ నుండి ఉపసంహరించుకోవాలని అన్నారు.
కృష్ణా: విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను టీడీపీ MLA పరుచూరి అశోక్ బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు తిలకించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. విద్యార్థులలో ఆలోచన శక్తి, నైపుణ్యం పెంచే దిశగా పాలీటెక్ ఫెస్ట్ దోహదపడుతుందన్నారు.
నిజామాబాద్: ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో నేడు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము గతవారం రిలే దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సమస్యలు పరిష్కారించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అన్నమయ్య: వాల్మీకి , బోయల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు మండెం ప్రభాకర్, నల్లబోతుల నాగరాజులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మదనపల్లె పట్టణంలో నూతన డైరెక్టర్లను వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్త రాశి హరికృష్ణ, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్టీ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నారు. అతడిపై గతంలో విశాఖలో కేసు నమోదైనట్లు గుర...