VZM: దత్తిరాజేరు మండలం పెదమానాపురం పశువులు సంతలో జరుగుతున్న అక్రమ రవాణా పై చర్యలు చేపట్టాలని, కేసులు నమోదు చేయాలని బొబ్బిలి రెవిన్యూ డివిజన్ అధికారి రామ్మోహనరావు సూచించారు. బొబ్బిలి తన కార్యాలయంలో మంగళవారం జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని వాటి అమలుకు అధికారులు కృషి చేయాలన్నారు.
కృష్ణా: ఎ.కొండూరు మండలంలోని పాత కొండూరు పెద్దబీడులో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇచ్చి ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేయాలని కోరుతూ.. మండల సీపీఎం ఆధ్వర్యంలో దళితులు కొండూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 7న జరిగిన రెవెన్యూ సదస్సులో దళితులు తహశీల్దార్ ఆశయ్యకు వినతి పత్రం అందజేసినట్లు మండల సీపీఎం పార్టీ కార్యదర్శి పానెం తెలిపారు.
GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులో మాజీఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన వంగవీటి విగ్రహానికి భూమి పూజ చేశారు.
ADB: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే దగాపడ్డ కళాకారుల డప్పుల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ధూంధాం కళాకారులు లింగంపల్లి రాజలింగం కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్యతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 12, 13వ తేదీలలో హైదరాబాదులోని ఎస్వీకేలో కళాకారుల కార్యక్రమం ఉంటుందన్నారు.
డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తుది జట్టులో రెండు మార్పులు ఉంటాయని అంచనా వేశాడు. అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణలను తుది జట్టులోకి తీసుకుంటారని తెలిపాడు.
AP: సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.
AP: వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. దీనిలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు సూచించారు.
ASR: డుంబ్రిగుడ మండలంలో జంగిడివలస, అడ్రగూడ జాంగూడ గ్రామాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అరకు నియోజవర్గం నాయకురాలు సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు పలు పోటీలను నిర్వహించి గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేశారు.
TG: వికారాబాద్ జిల్లాలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ నాయకత్వం దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో ఇదే రకంగా తెలంగాణ భాషను అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానమని పేర్కొన్నారు.
EG: రాజమండ్రిలో సినీ నటి నిధి అగర్వాల్ మంగళవారం సందడి చేశారు. ఓ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. నిధి అగర్వాల్‌తో పాటు MLA ఆదిరెడ్డి వాసు, వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు
CTR: నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కూనమరాజుపాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మండల ఎమ్మార్వో శేషగిరి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో రైతులు ఇచ్చిన వినతులను పరిశీలించి రైతులకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ELR: కుక్కునూరు మండలం వేలేరు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గ్రామంలోని పామిలేరు నది గట్టున సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే.శ్రీనుబాబు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై, సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం అమలు చేయాలని రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ఒంగోలుకు చెందిన రాయపాటి జగదీష్ కోరారు. మంగళవారం తాడేపల్లిలోని మంత్రి చాంబర్లో కలిశారు. కేంద్రం విటమిన్లతో కూడిన బియ్యాన్ని హాస్టల్స్‌కు అందిస్తుందని, సంక్షేమ హాస్టల్ అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
NGKL: వెల్దండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ BRS పార్టీ ఆధ్వర్యంలో.. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు BRS పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పుట్ట రాంరెడ్డి, యాదగిరి, శేఖర్, అశోక్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.