• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సాగునీటికి ఎన్నికల శిక్షణా కార్యక్రమం

SKLM: సరుబుజ్జిలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పావని, ఎమ్మార్వో మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం డీఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రకారం సాగునీటి ఎన్నికలపై ఊర్లలో దండోరా వేయించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

December 10, 2024 / 04:20 PM IST

‘పాఠశాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి’

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసి సిబ్బంది కొరతను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అనేక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

December 10, 2024 / 04:19 PM IST

విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎంపీడీవో

ELR: 10వ తరగతిలో ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తీర్ణత సాధించుటకు కష్టమైన పని కాదని, ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వందరోజుల ప్రణాళికలను ఫాలో అవుతూ ప్రిపరేషన్ కొనసాగించాలని ఉంగుటూరు ఎంపీడీవో జిఆర్ మనోజ్ 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం సాయంత్రం బాదంపూడి జిల్లా పరిషత్ హైస్కూల్‌ని సందర్శించి పిల్లలతో సంభాషించారు.

December 10, 2024 / 04:19 PM IST

హైడ్రా కమిషనర్‌‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే

TG: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలిశారు. చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. చెరువుల కబ్జాపై రెండు నెలల క్రితమే చెప్పానని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఎవరని, వారిపై చర్యలేవని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్షార్హులేనని పేర్కొన్నారు.

December 10, 2024 / 04:19 PM IST

రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ

KKD: దాన్యం కొనుగోలులో రైతుల బిల్లులు చెల్లింపునకు సంబందించిన ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (ఎఫ్డీవో)లను సకాలంలో అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన ఆదేశించారు. మంగళవారం సామర్లకోట మండలం ఉండూరు, వీకే రాయపురం గ్రామాల్లో రైస్ మిల్లులు, రైతు భరోసా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

December 10, 2024 / 04:18 PM IST

బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

SKLM: శ్రీకాకుళం పట్టణం మిడి కవర్ వద్ద శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు మంగళవారం వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఇటీవల దొంగలించబడిన నాలుగు బైకులతో పాటు నిందితులు పట్టుకోవడం జరిగిందని సీఐ ఈశ్వరరావు తెలిపారు. వాళ్ళు ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందినవారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

December 10, 2024 / 04:17 PM IST

‘ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా’

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్థానికంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం వంటి హామీలను ప్రకటించారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇప్పటివరకు 31 మంది అభ్యర్థ...

December 10, 2024 / 04:14 PM IST

ఈనెల 14న గోరక్షకులు ఆత్మీయ కలయిక

VZM: ఈనెల 14న విజయనగరంలో జరగనున్న గో రక్షకుల ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని గో సంరక్షణ సమైఖ్య రాష్ట్ర అధ్యక్షులు లోగిశ రామకృష్ణ అన్నారు. బొబ్బిలిలో గో రక్షకులు కలయికకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయనగరం అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల నల్లమారమ్మ తల్లి గుడి వెనుక ఉన్న తోటలో జరుగుతుందన్నారు.

December 10, 2024 / 04:13 PM IST

విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షకు సన్నద్ధం కావాలి

SKLM: సీతంపేట మండలం పెదపొల్ల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈవో నారాయుడు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, సంతృప్తికరం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. అందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలిపారు.

December 10, 2024 / 04:12 PM IST

కోర్టు బోనెక్కిన ఇజ్రాయెల్ ప్రధాని

దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. అతనిపై మోసం, నమ్మకద్రోహం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయినప్పటికీ విచారణకు హాజరయ్యారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో మొదటి సారి కోర్టు మెట్లెక్కడం తొలిసారి కావడం విశేషం.

December 10, 2024 / 04:11 PM IST

బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా గుండేటి సునీత

JGL: బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన గుండేటి సునీతను బీసీ సంఘం నాయకులు మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేష్, యువజన అధ్యక్షుడు ముఖేష్ ఖన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వొంటిపులి రాము, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 04:09 PM IST

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

సత్యసాయి: సోమందేపల్లి మండలం చల్లాపల్లిలో మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన కురు మారుతీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బాబురెడ్డి పాల్గొన్నారు.

December 10, 2024 / 04:09 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి

NLR: జిల్లాలో మత్య్సకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర పంచాయితీరాజ్ శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం జిల్లాలో మత్య్సకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు.

December 10, 2024 / 04:08 PM IST

‘బాలికను హత్య కేసులో నిందితుని కఠినంగా శిక్షించాలి’

NDL: నందికొట్కూరు పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న అమ్మాయి లహరి ప్రేమాన్మాది చేతిలో మృతి చెందిన సందర్భంగా స్థానిక పటేల్ సెంటర్ నందు విద్యార్థులతో ర్యాలీగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా మాట్లాడుతూ.. దేశంలోనూ అలాగే రాష్టంలోను అనేక చోట్ల నిత్యం మహిళతో పాటు బాలిక హత్య చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకోవాలి.

December 10, 2024 / 04:07 PM IST

ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని

BPT: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో MLC వేపాడ చిరంజీవితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

December 10, 2024 / 04:07 PM IST