కృష్ణా: మచిలీపట్నం NH-216 పై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, డీఎస్పీ రాజా పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ రాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని అధికారులు కోరారు.
SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన ఏడుగురు గౌడ కౌన్సిలర్లను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని శ్రీ కంఠమహేశ్వరి సూరమాంబ దేవస్థానం సన్నిధిలో కార్యక్రమం నిర్వహించారు. జై గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.
బాపట్ల: తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలోని ఉయ్యాలవాడ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలసలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలు చేసినట్లు స్థానిక ఎస్సై బాలరాజు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు ఈనెల 23 నుండి మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉ. 8 గంటల నుంచి మ. 1 గంట వరకు జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు.
సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద ఆదివారం సత్యన్న సేన సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ఫూర్తితో ఐదుగురు గర్భిణీలకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని అందజేశారు. నిరుపేద గర్భిణీలకు ప్రసవం వరకు ప్రతి నెలా ఈ పోషక ఆహారం పంపిణీ చేస్తామని సభ్యులు తెలిపారు. కరోనా కాలం నుంచి ఈ సేవ చేస్తున్నామని తెలిపారు.
కృష్ణా: ఉయ్యూరు రూరల్ పరిధిలోని పెదఓగిరాల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై సురేష్ బాబు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థలో ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ డిప్యూటీ మేయర్ ఛాంబర్ కేటాయింపు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 2005లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుండటం గమనార్హం. గతంలో డిప్యూటీగా పనిచేసిన తాజా మాజీ మేయర్ సునీల్ రావుకు ఛాంబర్ కేటాయించవద్దనే డిమాండ్ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.
MDCL: మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అదివారం బోయినపల్లిలోని తన కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యాలు, విద్యుత్ లైన్ల మార్పు, శ్మశానవాటిక పరిరక్షణ వంటి సమస్యలను ప్రస్తావించారు.
SDPT: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో శ్రీ శంభు-రామ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జనగామ MLA డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VSP: క్రీడల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని ఏసీపీ కె. ప్రభాకర్ అన్నారు. మురళీనగర్ స్కేటింగ్ పార్కులో కియా వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కేటింగ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు ఆటల్లో రాణించడం వల్ల పిల్లలు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని పేర్కొన్నారు.
GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడ భాస్కరరావు ఆదివారం రూ. 50 వేల విరాళం అందజేశారు. ఆలయ ఉపకమిషనర్ లీలా కుమార్, పాలక మండలి ఛైర్మన్ పూర్ణచందర్రావు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానానికి భక్తులు విరాళాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. దాతకు ప్రత్యేక దర్శనం, శేషవస్త్రంతో సత్కరించారు.
MDK: హిందూ ముస్లింల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, విద్యావేత్త మౌలాన అబుల్ కలాం ఆజాద్ అని మున్సిపల్ ఛైర్మన్ కానుగు రాధిక పేర్కొన్నారు. ఆదివారం విద్యావేత్త, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని మెదక్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు.
AP: భారత్ నెట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. CM చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు MOUపై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్‌నెట్ లక్ష్యంగా ఒప్పందం.. డిజిటల్ సేవల విస్తరణకు భారత్ నెట్ సహకారం అందించనుంది.
VZM: బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు అన్నారు. ఆదివారం భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెట్టగా అందులో సామాన్య ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.
BHNG: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయాలని రాజు సూచించారు.