ELR: మానసిక ఉల్లాసం ద్వారా పని ఒత్తిడిని జయిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆదివారం పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసుకున్న వనసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ఒక వరమనే అన్నారు.
MHBD: తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగునున్నాయి. డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. మొదటి విడతలో నెల్లికుదురు, రెండో విడతలో చిన్న గూడూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు, మూడవ విడతలో మరిపెడ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ELR: ద్వారకతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు.
BDK: SGFU- 17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పోటిల్లో జులూరుపాడు నివాసి గంధం హరిక (17) బంగారు పతకం సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నేడు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వరుసగా గెలిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
హనుమకొండలో ముదిరాజ్ విద్యార్థుల వసతి గృహం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రభాకర్, రాజేశ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
సత్య సాయి బాబా జయంతి సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఆయనను స్మరించుకున్నారు. ‘నాకు చిన్నప్పుడు మీరు పెట్టిన విజయ్ సాయి అనే పేరుతోనే ప్రతిరోజు జీవిస్తున్నానని’ అన్నారు. మంచి, చెడులోనూ మీ గురించి ఆలోచిస్తామని, మీరు ఎప్పటికీ జీవించే ఉంటారంటూ పుట్టపర్తిలో చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. సత్యసాయితో దిగిన చిన్ననాటి ఫోటోను SMలో పంచుకున్నారు.
ELR: బాలలకు కేవలం పుస్తకంశాలు మాత్రమే కాకుండా చట్ట సభలు, వాటి పని తీరు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై సైతం వారికి అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాక్ అసెంబ్లీకి ఎంపికైన గంధం లితికాను ఆయన అభినందించారు.
WNP: సత్యసాయి బాబా చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఇవాళ కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సాయిబాబా శత జయంతి సందర్భంగా ఐడీవోసీ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ప్రజాసేవకై ట్రస్ట్ ఏర్పాటు చేసి బాబా చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఆయన చూపిన సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయాలని కలెక్టర్ సూచించారు.
JGL: పెగడపెల్లి మండలం సుద్దపెల్లిలో జరిగిన త్రయాహ్నిక ఏక కుండాత్మక నూతన ఆలయ విగ్రహ స్థిర ప్రతిష్టా మహోత్సవంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రిని శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
VSP: విశాఖలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాలు ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా భాసిల్లుతున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు.
JN: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్‌లో చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తనకూ మహిళలు అంటే ప్రత్యేక అభిమానమని, ఎందుకంటే తనకు ముగ్గురు ఆడపిల్లలు, ఆరుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారన్నారు.
JGL: ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్, సివిల్ సప్లై అధికారులతో కలిసి కొనుగోలు పురోగతిని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా, పారదర్శకంగా కొనుగోలు జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు, వాహనాలు, హమాలీలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలన్నారు.
KNR: కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం విద్యార్థులకు మొదటి సంవత్సరం (ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ మామిడిపల్లి సత్య ప్రకాష్ పవిత్రమైన ఉసిరి మొక్కను నాటి ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు వారి మేధాశక్తిని వినియోగించుకుని పరిశోధనా దిశగా అడుగులు వేయాలన్నారు.
WGL: గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్‌లో చీరల పంపిణీలో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రేపు కోదాడ, మునగాల, చిలుకూరు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మునగాలలో ఉచిత చేపపిల్లల విడుదల, మహిళా శక్తి చీరల పంపిణీతో రోజును ఆరంభించి, కోదాడ పట్టణంలో DMFT నిధులతో సజ్దా ప్లాట్‌ఫామ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణ శంకుస్థాపనలు ,క్యాంప్ కార్యాలయంలో సీఎమ్ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు.