ATP: రైతుల సమస్యలు పరిష్కరానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం మండలం కామారుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆర్డీవో కేశవ నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వాకంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
GNTR: పొన్నూరు MPDO కార్యాలయం నందు 2014-2019 కాలంలో టీడీపీ హయంలో నిర్మించిన శ్రీశక్తి భవనాన్ని మంగళవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు నిర్మించిన పంచాయతీరాజ్ భవనాన్ని పరిశీలించి జరిగిన పనులను, చేయాల్సిన పనులు గురించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
GNTR: ఏపీ నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్ కృష్ణయ్య గెలుపు లాంఛనమేనని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయనను కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. బీసీల ఆత్మగౌరవం నిలిపిన నాయకుడు, వారి హక్కుల కోసం పోరాటం ఢిల్లీ స్థాయిలో చేసిన ఆర్ కృష్ణయ్య విజయం అందరి విజయం అన్నారు.
AP: పార్టీ మారిన ఇద్దరిని రాజ్యసభకు పంపారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు తమ మంత్రిపై నమ్మకం లేక కాకినాడ వచ్చారని అన్నారు. ‘కొందరు ఎమ్మెల్సీలు అమ్ముడుపోయి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నా. తాము తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి. మీరే అధికారింలో ఉన్నారు కదా’ అని పేర్కొన్నారు.
SRCL: ప్రభుత్వ నిర్మాణ, స్థానిక, వాణిజ్య అవసరాలకు ఇసుక రీచ్‌లు గుర్తించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ శ్యాండ్ కమిటీ మీటింగ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఓ నెంబర్ 3, టీజీ ఎం.డీ.సీ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు.జిల్లాలో ఎన్ని ఇసుక రీచ్ లు ఎన్ని ఉన్నాయో ఆరా తీశారు.
కృష్ణా: ప్రభుత్వ విధుల పట్ల అంకితభావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లోని అర్హత గల అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో అప్పగించిన విధులు నిర్వర్తించి, తాము పనిచేస్తున్న శాఖలో అధికారుల మన్ననలు పొందాలన్నారు.
AP: నెల్లూరులోని పొంగూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. గతంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పట్టా పాసు పుస్తకంపై జగన్ ఫొటోను ముద్రించి రైతులను దోపిడీ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
నంద్యాలలో మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశానికి వెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో దివంగత సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన పలువురు మంత్రులు, సహచర శాసనసభ్యులతో ముచ్చటించారు.
NZB: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా అర్ధరాత్రి మహిళలు అక్రమంగా అరెస్టు చేయడాన్ని, సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)లైన్వాడ, మన్యం చెల్క అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా వర్కర్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వ్యక్తం చేశారు.
అన్నమయ్య: అక్రమ రేషన్ బియ్యం రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన రైస్ మిల్లుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎస్పీ కుటుంబ సభ్యులతో, రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కళ్యాణమండపంలో వేదోక్త ఆశీర్వదించి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.
KNR: ఇల్లంతకుంట మండలం నుంచి చలో హైదరాబాద్ తరలివెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుల పట్ల ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ఇస్తామన్న రూ.18 వేల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెంలోని సీడబ్ల్యుఎస్ గ్రౌండ్‌లో జరిగిన మండల పాస్టర్స్ ఐక్య గ్లోరియస్ క్రిస్మస్ వేడుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి శాంతి కలుగజేసిన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
KMM: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు అని అన్నారు.
KRNL: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిరివెళ్ల తహసీల్దార్ పుష్పకుమారి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బోయలకుంట్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.