PLD: గురజాల మండలంలోని పలు ప్రాంతాలలో మంగళవారం వర్షం కురిసింది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే మబ్బులు పట్టి చిరుజల్లులు మొదలవడంతో గ్రామ సమీప ప్రాంతాలలో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు ఇళ్లల్లోని పట్టాలు తీసుకుని పరుగులు తీశారు. కల్లాల్లో ఉన్న మిర్చి రాశులపై పరదాలు కప్పారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. మొత్తం 55 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదం లభించింది. అలాగే.. విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యాసాయి, చీరాల, రాజమండ్రిలో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నేత శ్రీరాముల రామచంద్రం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ADB: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలిసి, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో రత్నకళ్యాణి, తదితరులు ఉన్నారు.
PPM: ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్ సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో కాంప్లెక్స్ నుండి బస్సు వెనక్కి వస్తుండగా అదే మార్గంలో వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టింది. మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి కిందపడడంతో కాలుకు గాయం తగిలింది. విధులలో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది ఆసుపత్రికి ఆటోలో తరలించారు.
TG: నిజామాబాద్‌లో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని BJP చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ‘రాష్ట్రంలో చట్టం-వ్యవస్థ పరిస్థితి క్షీణిస్తుంది. పౌరుల భద్రతను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక న్యాయవాదిపై దాడి జరగడం అంటే అది ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడిగా భావించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
VKB: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆదేశాలు అమల్లో ఉంటాయని కుల్కచర్ల ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు. పరీక్షల కాలంలో పరీక్షా కేంద్రాల వద్ద Cr PC సెక్షన్ 144 అమల్లో ఉంటుందని చెప్పారు. గుంపులుగా చేరడం, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
SRD: కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా మాణిక్యం మంగళవారం ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
HYDలో ఉష్ణోగ్రతల 33 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్న వేళ విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి పరిధిలో 965, మేడ్చల్ 626, హైదరాబాద్ మెట్రో జోన్ ప్రాంతాల్లో 297 DTRలు ఏర్పాటు చేస్తున్నట్లుగా డిస్కం అధికారులు తెలిపారు. HYDలో 3500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ రికార్డు అవుతుంది.
GDWL: గుండెపోటుతో ఇంటి యజమానిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబానికి ఈ ఐదు లక్షల ఆర్థిక సాయం భవిష్యత్తుపై భరోసానిస్తుంది అని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ అన్నారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామానికి శారదమ్మకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ సొమ్మును వృథా చేయకుండా పిల్లల చదువులకు వాడాలన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS)కు ఎంపికైనట్లు ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. ఇది పాఠశాలలో అమలు చేస్తున్న సమర్థవంతమైన బోధన విధానాలకు నిదర్శనమని మండల విద్యాధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డు, పంచాయతీల పరిశీలకులు, మండల, పట్టణ కన్వీనర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం నుంచి ప్రజా సమస్యల పోరాటం వరకు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
సూర్యాపేట జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఫెర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే పారదర్శకంగా యూరియా బుక్ చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్ లేని వారు వాలంటీర్ల సాయం తీసుకోవాలన్నారు. అనవసరంగా నిల్వ చేయవద్దని, అవసరమైనప్పుడే కొనుగోలు చేసి సహకరించాలని ఆయన కోరారు.
ATP: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు నుంచి పార్టీ బలోపేతం వరకు పలు అంశాలపై వీరు చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి వ్యూహాలపై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.
NZB: పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల అనుమతి లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.