• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాధితున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి HYD వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

February 24, 2026 / 07:29 PM IST

కౌతాళం కొనసాగుతున్న రాజీనామాల పర్వం

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు మాజీ ఎంపీటీసీ, టీబీపీ ఎల్ఎల్‌సీ వైస్ ఛైర్మన్ ఈరన్న టీడీపీ సభ్యత్వానికి, తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 07:27 PM IST

కాట్రపల్లిలో ఉపాధి హామీ పనులపై సమీక్ష

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి మంగళవారం ఆడిటర్లతో కలిసి సమీక్షించారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:27 PM IST

ప్రజల ఫిర్యాదులపై ఆస్పత్రి తనిఖీ: ఛైర్మన్ సారంగపాణి

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

February 24, 2026 / 07:26 PM IST

పరీక్షల నిర్వహణపై CS రామకృష్ణారావు సమీక్ష

KMM: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:26 PM IST

‘వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలి’

MNCL: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.

February 24, 2026 / 07:26 PM IST

మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ ప‌రిధిలో డ‌యేరియా కార‌ణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్ర‌భుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇతర బాధిత కుటుంబాల‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.

February 24, 2026 / 07:25 PM IST

షార్ట్ సర్క్యూట్‌తో భవనం దగ్థం..!

అన్నమయ్య: మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించగా,పెద్ద ప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా భవనం మిద్దెపై ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అధికారి శివప్ప ఆధ్వర్యంలో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వేగవంతమైన చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 07:25 PM IST

కంటి వైద్య శిబిరం ఎర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ

SRPT: HNRలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లైసెన్స్ డ్రైవర్ల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు SI తెలిపారు. మంగళవారం ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు పరిశీలించారు. డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 07:22 PM IST

శనగల కొనుగోలు ప్రక్రియ వేగవంతం: జేసీ

ATP: జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది క్వింటాల్ శనగలకు ప్రభుత్వం 5,875 రూపాయల మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.

February 24, 2026 / 07:20 PM IST

కలెక్టర్ చొరవ.. క్షేమంగా స్వగ్రామానికి చేరిక

కోనసీమ: మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ తాటిపాకకు చెందిన కర్రీ సౌజన్య, కందికుప్పకు చెందిన బొజ్జ లక్ష్మీదుర్గ మంగళవారం క్షేమంగా స్వగ్రామం చేరారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ పని దొరకక అవస్థలు పడుతున్న వారిని కలెక్టర్ మహేశ్ కుమార్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా రప్పించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 07:20 PM IST

కనుముకులలో వైభవంగా వేంక‌టేశ్వ‌రుడి తిరు కళ్యాణం

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల‌ జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల‌ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.

February 24, 2026 / 07:20 PM IST

సాదా బైనామా వెంటనే అమలు చేయాలి: బీజేపీ వినతి

WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఆర్డీవో ఉషారాణికి BJP పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కోరారు.

February 24, 2026 / 07:20 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతం నుంచి చౌట్పల్లి గ్రామానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. వాసంగట్టు తండాకు చెందిన లకావత్ రాజేందర్‌ను మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 07:20 PM IST

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐఎఫ్టీయూ ధర్నా

ELR: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలందరికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలతో రోగులను విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేయడం సరికాదన్నారు.

February 24, 2026 / 07:20 PM IST