ASR: మార్చి నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఈనెల 28న శనివారం లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేయడం జరుగుతుందని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. మండలంలో 7,457 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,12,79,000 సొమ్ము మంజూరైనట్లు తెలిపారు. ఈనెల 27న బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
కృష్ణా: గుడివాడలో టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
SDPT: జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
JGL: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు జగిత్యాల జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాల్లో 15123 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు రాజగౌడ్, లత, ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని స్పష్టం చేశారు.
AKP: నాతవరం(మం) లింగంపేట పంచాయతీలో మంగళవారం ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ పర్యటించారు. ముందుగా పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శించి, పౌష్టికాహారంను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.
MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు నీటి వినియోగం, పంటల మార్పిడి పై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, ఉద్యాన శాఖ అధికారి రచన ఆధ్వర్యంలో పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. నేలలో సేంద్రియ కార్బన్ ప్రాముఖ్యత ఎలా పెంచుకోవాలో వివరించారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలో ఆడియలోజిస్ట్ ఉచిత క్యాంపు నిర్వహించారు. వినికిడి సంబంధిత వైద్య నిపుణుడు డాక్టర్ రజనీకాంత్ 65 మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వినికిడి, సమతుల్యత సంబంధిత సమస్యలను నిర్ధారించి, చికిత్సలు చేశారు. వినికిడి లోపాలతో పాటు టిన్నిటస్ (కానుక శబ్దం), చిరాయి తిరగడం వంటి సమస్యలను పరీక్షించారు.
GDWL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో హాజరుకావాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
TG: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ మతతత్వ రాజకీయాలు బంద్ చేయాలని సూచించారు. కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పులు మోసిన బండి సంజయ్‌కు సీఎం రేవంత్‌ను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. పిచ్చి మాటలు మాని ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
KNR: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శంకరపట్నం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ సూచించారు. తాడికల్ రైతు వేదికలో MPO ప్రభాకర్ అధ్యక్షతన 9 గ్రామాల నూతన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న 2వ రోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరం వస్తుందన్నారు.
SRD: ప్రపంచానికి మేధావులను తయారు చేసే హైదరాబాద్ (కంది) IIT యూనియన్ ఎన్నికలలో సీఐటీయు నాయకుడు అతిమేల మాణిక్‌ను ఎన్నుకోవడం గర్వకారణంగా ఉన్నదని CITU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రాజయ్య అన్నారు. సీఐటీయు అంటే కేవలం కార్మికుల సమస్యలు కాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారానికి పోరాటం చేసే సంస్థ CITU అని అన్నారు.
ADB: లోకారి గ్రామం నుంచి గాదిగూడ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు వాపోతున్నారు. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్ల నుంచి ప్రయాణిస్తే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అని రాకపోకలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
E.G: రాజానగరం నియోజకవర్గ స్వరూప నగర్ కాలనీకి చెందిన రాధాక్రిష్ణ మూర్తి (75) కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO కృష్ణ నాయక్, రాజానగరం MRO తదితరులు పాల్గొన్నారు.
KMR: అర్హులైన మైనార్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులు పాల్గొన్నారు.
GNTR: గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము తాళాల సీళ్లు, సీసీ కెమెరాలు, ప్రాంగణాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. భద్రతా చర్యలను నిరంతరం పటిష్టంగా అమలు చేయాలని ఆమె సూచించారు.