Super feature : వాట్సాప్‌లో సరికొత్త మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్’ ఆప్షన్‌ను (Edit message) వాట్సాప్ తీసుకొస్తోంది.
ప్రపంచంలో అత్యధిక మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. 2009లో ప్రారంభమైన ఈ ఆన్లైన్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్.. తక్కువ కాలంలో విశేష ఆదరణ పొందింది. తర్వాత ఈ యాప్‌ను ఫేస్బుక్ (Facebook) వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) కొనుగోలు చేశారు. అయితే వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. తాజాగా మరో సూపర్ ఫీచర్ (Super feature) అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు టైప్ చేస్తుంటే తప్పులు వస్తుంటాయి. అవి చూసుకోకుండా సెండ్ బటన్ మీద క్లిక్ చేసి మనం పంపించేస్తాం. ఆ తర్వాత చూసుకుని అరెరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని డిలీట్ (Delete) చేయడమో లేక దాని తర్వాత సరిచేసి వేరే మెసేజ్ టైప్ చేసి పంపుతాం. అదే మెసేజ్ కాస్త పెద్దదైతే మళ్లీ టైప్ చేయలేక కాపీ చేసి దాన్నే సరిచేసి పంపుతాం.
ఇంత ప్రాసెస్ అవసరమా? అదే మెసేజ్‌ను ఎడిట్ (Edit) చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంటుంది.అయితే పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పొరపాటున తప్పుగా మెసేజ్ పంపినా ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ఏడాది ప్రారంభంలో డెవలపర్లు ఈ ఫీచర్‌ను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపించిన 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే విధంగా సరికొత్త ఫీచర్‌ను టెస్ట్ చేసినట్లు సమాచారం.ఆండ్రాయిడ్ (Android) యాప్‌తో పాటు, ఐఓఎస్(iOS), వెబ్ యూజర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేదీ మాత్రం వాట్సాప్ తెలిపాలేదు. మరోవైపు అంతర్జాతీయ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు రింగ్ రాకుండా చేసే ఆప్షన్ సైతం ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.