చికెన్ మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కోడికూర ధరలు(Chicken prices) హైదరాబాద్లో(hyderabad) ఒక్కసారిగా పెరిగాయి. 200 రూపాయల నుంచి అమాంతం 250కు చేరాయి. దీంతో పలువురు మధ్యతరగతి ప్రజలు చికెన్ తీసుకునేందుకు వెనకాడుతుండగా..మరికొంత మంది మాత్రం రేటు పెరిగినా కూడా తగ్గేదేలే అంటున్నారు.
చికెన్ ప్రియులకు నిజంగా ఇది బాధపెట్టే విషయమే. చికెన్ ధరలు(Chicken prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ చికెన్ ధర రూ.250కి చేరింది. ఎండలు తీవ్రంగా ఉండటం, వేడి గాలుల కారణంగా కోళ్లు విపరీతంగా చనిపోతున్నాయట. దీంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.
వేసవిలో కోళ్ల పెంపకం తక్కువ. అందుకు తగ్గట్టుగా సీజనల్ గా వచ్చే వ్యాధులతో కొన్నికోళ్లు మృతి చెందుతాయి. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చికెన్ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగినట్లు విక్రయదారులు చెబుతున్నారు.
గతవారంలో కిలో బాయిలర్ కోడి మాంసం ధర రూ.200-రూ.210 వరకు ఉండగా.. ఫారం కోడి ధర రూ.150-రూ.170 వరకు ఉంది. ఈ వారం వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో బాయిలర్ మాంసం ధర రూ.280-285కు చేరగా.. ఫారం కోడి కిలో మాంసం ధర రూ.200 పలుకుతోంది.