తెలంగాణ(Telangana)లో ఇకపై ఐఫోన్లు(I Phones), ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు(Electronic products) తయారు కానున్నాయి. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ(Foxcon Company) తెలంగాణకు రానుంది. త్వరలోనే ఇది హైదరాబాద్ (Hyderabad)లో ఏర్పాటు కానుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి రేపు భూమి పూజ చేయబోతున్నారు. రూ.1,656 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామంలో ఈ ఫాక్స్‌కాన్ కంపెనీ నిర్మాణం కానుంది.
టీఎస్ఐఐసీ(TSIIC) ఆధ్వర్యంలో ఫాక్స్‌కాన్(Foxcon Company) భూమి పూజకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కంపెనీ ఏర్పాటైతే సుమారు 35 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఫాక్స్‌కాన్ సంస్థ ఏర్పాటుకు 196 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపింది.
ఫాక్స్‌కాన్ కంపెనీ(Foxcon Company) భూమి పూజకు సోమవారం మంత్రి కేటీఆర్(KTR)తో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు. భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేడు పరిశీలించారు. కంపెనీ ప్రాంగణంలో నిర్మించే రోడ్లు, ఇతర భవనాల మ్యాప్ లను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులు దిశానిర్దేశం చేశారు.