CTR: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గురించి వివరించారు.