NGKL: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల్లో తమ నైపుణ్యాన్ని చాటాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. క్రీడాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు.