మునుగోడు(munugode) ఎన్నికల పర్వం వాడి వేడిగా జరుగుతోంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే చాలా మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా.. స్క్రూటినీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 83 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఓకే చెప్పారు అధికారులు. అయితే.. వారిలో 36 మంది ఉపసంహరించుకున్నారు. దీంతె చివరకు మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్డులు నిలిచారు.
మునుగోడు ఉపఎన్నిక(munugode by election) నవంబర్ 3న జరగనుంది. 6న ఫలితాలు వెలువడతాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ నామినేషన్ వేశారు. అభ్యర్థులు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే.. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ… ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. మరి విజయం ఎవరి వైపు ఉందో… ఫలితం.. వచ్చే నెల 6వ తేదీన తేలనుంది.