Mothers Day:తొలి గురువు తల్లి.. పిల్లలకు మంచి, చెడు చెబుతోంది. చక్కని నడవడిక అలవరుస్తోంది. తన పిల్లల కోసం సర్వం త్యాగం చేస్తోంది. ఓ కొవ్వొత్తిలా కరుగుతూ.. కుటుంబం కోసం ముందు నిలుస్తోంది. పిల్లల ఆలనా పాలనా నుంచి పెరిగి పెద్దై మంచి జాబ్ వచ్చే వరకు వెన్నంటే ఉంటుంది. ఈ రోజు ప్రపంచ మాతృ దినోత్సవం (Mothers Day) సందర్భంగా హిట్ టీవీ ప్రత్యేక కథనం.
We love you so much! Happy Mother’s Day to the pillars of the Pandya family ❤️❤️❤️ pic.twitter.com/gOtWq3P8Ps
బిడ్డ కడుపులో పడినప్పటీ నుంచి ఆ తల్లి కంటికి రెప్పాలా కాపాడుకుంటుంది. బయటి ప్రపంచంలోకి వచ్చాక ఆ పసికందుకు ఏమైనా అయితే తల్లడిల్లుతోంది. అందుకే తల్లి (Mothers) మనసు తల్లిదేనని పెద్దలు చెబుతుంటారు. స్కూల్కు పంపిస్తూ.. ఇంటికి వచ్చాక చదివిస్తూ.. తినిపిస్తూ.. వారి కోసమే జీవితం అంకితం చేస్తోంది. విద్యాబుద్దులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెబితే.. ఇంటి వద్ద తల్లి ఆ పాత్రను పోషిస్తోంది.
పిల్లలను అప్పుడప్పుడు తండ్రి దండించినా.. ఎక్కువ కోపం చేసేది అమ్మ మాత్రమే. తప్పుడు దారిలో వెళ్లకండి అని దండించి మరీ చెబుతోంది. తిట్టినా.. కొట్టినా మళ్లీ వెంటనే దగ్గరకు తీసుకుంటుంది. తాను తినకున్నా.. పిల్లలకు తినిపిస్తోంది. వారి ఉన్నతి కోసం క్షణ క్షణం తపిస్తూ ఉంటుంది అమ్మ (maa). అలాంటి అమ్మలందరికీ హిట్ టీవీ పోర్టల్ తరఫున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
ఏటా మే రెండో ఆదివారం రోజున మదర్స్ డే జరుపుకుంటున్నారు. మదర్ ఆఫ్ గాడ్స్గా పిలిచే రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో గ్రీస్ దేశంలో నిర్వహించారు. అలా మొదలై.. నేటికి కంటిన్యూ అవుతుంది. విదేశాల్లో అయితే పిల్లలు స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశంతో వదిలేస్తారు. అమ్మను ఓ రోజు చూసుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు కేటాయించారు. భారతదేశంలో పేరంట్స్తో పిల్లలు కలిసి ఉంటారు. తల్లిదండ్రులను దైవంగా చూస్తారు. కంటికి రెప్పాలా చూసుకుంటారు.
I am proud to embrace motherhood for all the right reasons.
I chose to have a child when I was emotionally prepared to give unconditional love & care that my child deserves for his/her overall well-being.
— Upasana Konidela (@upasanakonidela) May 14, 2023
మదర్స్ డే (Mothers day) సందర్భంగా సెలబ్రిటీలు తమ తల్లులతో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (sachin) తన తల్లితో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ రోజుల్లో ఏదైనా భర్తీ చేయలేనిది ఉందంటే అది అమ్మ ఆశీర్వాదమేనని తెలిపారు. మరోవైపు సమాజం కోసమో, వారసత్వం కొనసాగించేందుకో బిడ్డను కనడం లేదని ఉపాసన కామినేని (upasana) ట్వీట్ చేశారు.