Chiranjeevi: చిన్నారి సింగర్ కు..మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చిన్నారి ప్రణతిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. తన ఇంటికి పిలిచి మరి మెగాస్టార్ మెచ్చుకున్నారు.
సంగీతం అన్ని సరిహద్దులను అధిగమించి సంస్కృతితో సంబంధం లేకుండా ప్రజలను ఒకచోట చేర్చుతుంది. తెలుగు సంగీతం విషయానికి వస్తే, ఇది కేవలం వినోదం కాదు. చాలా మందికి జీవన విధానం కూడా. ప్రస్తుతం తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2(Telugu Indian Idol 2)ని పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించింది. దీంతోపాటు రాబోయే గాయకుల ప్రతిభను కూడా ప్రొత్సహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరిలో విశాఖపట్నంకు చెందిన పద్నాలుగేళ్ల సింగర్ ప్రణతి(Pranitha) ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. దీంతో మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ ఆమెపై పదే పదే ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఈ అద్భుత ప్రతిభగల యువ కళాకారిణి తన విజయాలకు మరో ప్రశంస కూడా చేరింది.
ప్రముఖ స్టార్ హీరో చిరంజీవి(Megastar Chiranjeevi) నివాసం ఇంటి నుంచి ఈ చిన్నారికి పిలుపు వచ్చింది. దీంతో మెగాస్టార్ ఇంటికి వెళ్లిన చిన్నారి అన్నమాచార్య కీర్తన పాడి అదుర్స్ అనిపించుకుంది. మెగాస్టార్ భార్య సురేఖ కూడా ఆ చిన్నారి ప్రతిభకు విస్మయానికి చెందారు. ఈ సందర్భంగా చిరంజీవి సహా పలువురు ఆమెకు ఆశీస్సులు అందించారు. దీంతోపాటు మిగిలిన సీజన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ ప్రశంసతో ప్రణతి(Pranitha) సంతోషం వ్యక్తం చేసింది. చిరంజీవి, అతని భార్య వారితో నటించే అవకాశాన్ని కూడా ఇచ్చారని పేర్కొంది. ఇది తన కల నిజమయిన క్షణమని తెలిపింది. ఈ నేపథ్యంలో పోటీలో తన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో కంటే మరింత మెరుగ్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చిన్నారి తెలిపింది. ఈ అనుభవం తనకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని వెల్లడించింది. అయితే మీరు కూడా ప్రణతి సాంగ్స్ వినాలంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని చూడాల్సిందే.