Muthireddy Yadagiri Reddy Fires On Palla Rajeshwar Reddy
Muthireddy Yadagiri Reddy: జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై (Muthireddy Yadagiri Reddy) వ్యతిరేకత కనిపిస్తోంది. కలెక్టర్‌తో గొడవ.. కన్న కూతురు మీడియా ముందుకు రావడంతో ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. జనగామ నుంచి పళ్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల టూరిజం ప్లాజాకు జనగామ నేతలు రావడం.. మంత్రి హరీశ్ రావు పిలిచాడని చెప్పిన సంగతి తెలిసిందే. జరుగుతోన్న పరిణామాలపై ముత్తిరెడ్డి స్పందించారు.
తనపై పళ్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) కుట్ర పన్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. జనగామ నుంచి 2 సార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు. జిల్లాను సాధించామని.. అభివృద్ధి చేశామని తెలిపారు. కార్పొరేట్ పద్ధతిలో నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏనాడు జనగామ ప్రజల మంచి, చెడును పల్లా చూడలేదని విమర్శించారు. పళ్లా ఎత్తు ఉంటారని.. ఆయన ఇక్కడ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గానికి చెందిన నేతలకు పళ్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ఎందుకు డబ్బులు పంచుతున్నారని ముత్తిరెడ్డి అడిగారు. ఇదీ ముమ్మాటికీ కరెక్ట్ కాదని చెప్పారు. నియోజకవర్గంలో ఎన్నిక మండలాలు ఉన్నాయో తెలుసా..? ఎన్ని గ్రామాల్లో తిరిగావు.. కష్ట, సుఖాల్లో పాల్గొన్నావా అని అడిగారు. నియోజకవర్గానికి చెందిన పిల్లలు మీ కాలేజీకి వస్తే.. సీటు ఇచ్చావా అని నిలదీశారు. ఉద్యమ సమయం నుంచి తాము ఉన్నామని.. కష్టం వస్తే అండగా నిలిచామని గుర్తుచేశారు.
ఎన్నికలు ఉన్నాయని అండర్ గ్రౌండ్లో డబ్బులు పంచడం ఏంటి అని ముత్తిరెడ్డి అడిగారు. జనగామను మరో హుజురాబాద్ చేయాలని అనుకున్నావా అని ప్రశ్నించారు. మీ కాలేజీ నుంచి మండలానికి 10 మంది చొప్పున ఎందుకు పంపించావని అడిగారు. పచ్చిన జనగామలో ఎందుకు చిచ్చు పెట్టాడని.. తన కూతురికి కూడా మాయమాటలు చెప్పారని ఆరోపించారు.