LLaMA2: సాంకేతికత రంగం(Technology sector)లో వండర్‌ను క్రియేట్ చేసి ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఏఐ టెక్నాలజీ(AI technology) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత నవంబర్ నెలలో ఈ టెక్నాలజీతో చాట్‌జీపీటీ వచ్చినప్పటినుంచి చాలా కంపెనీలు దీన్ని అధిగమించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వరసలో మెటా సంస్థ కూడా ఉంది. ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్(Google) తమ ఏఐ చాట్బాట్లను విడుదల చేసినప్పుడు మెటా సంస్థ కూడా లామా(Llama) అనే ఓ స్మాల్ వర్షన్ ఏఐని తీసుకొచ్చింది. తాజాగా కమర్షల్ కంపెనీల కోసం లామా2(LLaMA2) అనే కొత్తం వర్షన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.
చదవండి:Oppenheimer: ఒక్క సినిమా టికెట్ రూ.2450..ఏంటో స్పెషల్!
ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు పోటీగా రంగంలోకి దిగిన మెటా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విడుదల చేయడానికి బదులుగా రీసెర్చ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా లామా(LLaMA2) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్(open source). అంటే దాని అంతర్గత పనితీరు ఓపెన్ఏఐ, గూగుల్‌కు భిన్నంగా ఉంటుంది. ఇది ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుందని, నూతన టెక్నాలజీ నిర్మాణం కోసం డెవలపర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని మెటా సీఈవో జుకర్‌బర్గ్(Zuckerberg) ఫేస్బుక్ ద్వారా వివరించారు. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యాక భద్రతను కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ సరికొత్త శక్తిమంతమైన లామా 2గా పిలిచే ఈ మెటా మోడల్ వెర్షన్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ద్వారా ఏ వ్యాపారానికైనా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ చాటింగ్ యాప్ థ్రెడ్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చి ట్విట్టర్ కు గట్టిపోటీని ఇస్తున్న విషయం తెలిసిందే.