»Massive Explosion Took Place At The Police Station 17 Dead In Pakistan
Explosions In Pak : పోలీసు స్టేషన్ లో బాంబు పేలుడు.. 17 మంది మృతి
మరోసారి పాకిస్థాన్(Pakistan) బాంబు పేలుళ్ల(Bomb Blast)తో దద్దరిల్లిపోయింది. వరుస పేలుళ్లలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 12మంది పోలీసులు(Police) ఉన్నారు. ఈ పేలుడు దాటికి 50 మందికి పైగా సామాన్యులు గాయపడ్డారు.
Explosions In Pak : మరోసారి పాకిస్థాన్(Pakistan) బాంబు పేలుళ్ల(Bomb Blast)తో దద్దరిల్లిపోయింది. వరుస పేలుళ్లలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 12మంది పోలీసులు(Police) ఉన్నారు. ఈ పేలుడు దాటికి 50 మందికి పైగా సామాన్యులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్ లోని స్వాత్(Swat Valley) లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీడీటీ) పోలీస్ స్టేషన్(Police Station) లో జరిగిన పేలుళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ లోపల రెండు పేలుళ్ల కారణంగా భవనం(Building) ధ్వంసం అయిందని పోలీసులు తెలిపారు. పేలుళ్ల కారణంగా స్వాత్ ప్రావిన్స్ అంతటా భద్రతా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. ఇది ఆత్మాహుతి దాడి కాదని, మందుగుండు సామగ్రి, మోర్టార్ షెల్స్ నిల్వ ఉన్న ప్రదేశంలో పేలుడు సంభవించిందని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్ మీడియాకు తెలిపారు. పోలీస్ స్టేషన్ పై ఎలాంటి దాడి, కాల్పులు జరగలేదని స్ఫష్టం చేశారు.
పేలుడుకు గల కారణాలపై బాంబు డిస్పోజల్ స్క్వాడ్ లు దర్యాప్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు. కూలిన భవనం పాతదేనని, చాలా కార్యాలయాలు, సిబ్బంది కొత్త భవనంలో ఉన్నారని సీటీడీ డీఐజీ(CTD DIG) తెలిపారు. భవనం కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో స్వాత్ లోని ఆస్పత్రుల్లో ప్రావిన్షియల్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఎమర్జెన్సీ విధించింది. ఆత్మాహుతి దాడి జరిగిందని జిల్లా పోలీసు అధికారి షఫీ ఉల్లా గండాపూర్ (డీపీవో) తెలిపారు. ఈ దాడిపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan Prime Minister Shehbaz Sharif) ఈ పేలుడును ఖండించారు.