»Music School Movie Telugu Trailer Released By Vijay Devarakonda
Music School Trailer: రిలీజ్..విద్యార్థుల ఒత్తిడికి పరిష్కారం!
విద్యార్థులు..సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మ్యూజిక్ స్కూల్ మూవీ గుర్తు చేసినట్లు అనిపిస్తుంది. ఈరోజు హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం మే 12 , 2023న తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మ్యూజిక్ స్కూల్ చిత్రం తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. పాపా రావు బియ్యాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యార్థులు.. సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఎదుర్కొంటున్న విద్యాపరమైన ఒత్తిడి సమస్యల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇక ట్రైలర్ వీడియో అమ్మ 100కు 100 మార్కులు అనే చిన్నారి డైలాగ్ తో మొదలవుతుంది. శ్రియా శరణ్, శర్మన్ జోషి ఈ మూవీలో సంగీతం, నృత్య ఉపాధ్యాయులుగా నటించారు. గ్రేసీ గోస్వామి, ఓజు బారువాతో సహా యువ కళాకారులతో కలిసి ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ అనే సంగీత నాటకాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం నుంచి విపరీతమైన విద్యా ఒత్తిడి మధ్య పిల్లల కోసం కళలను ప్రోత్సహించడానికి సంగీతం, నాటక ఉపాధ్యాయుడు చేసే పోరాటాలను ఈ చిత్రంలో చూపించారు. డ్రామా, హాస్యం, భావోద్వేగాలు, సంగీతంతో నిండిన ఈ ట్రైలర్ గోవాలోని పలు లోకేషన్లలో షూట్ చేశారు. మరోవైపు మనకు సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదని ట్రైలర్లో చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటుంది.
చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. IAS అధికారిగా మారిన చిత్రనిర్మాత పాపారావు బియ్యాల దర్శకత్వం వహించి, ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా గ్రాండియర్ లుక్‌ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్స్ చిత్రీకరించారు. ఈ మూవీలో శ్రియ శరణ్, శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో ఉన్నారు. వీరితో పాటు ఒజు బారువా, గ్రేసీ గోస్వామి కీలక పాత్రలలో నటించారు. ఇతర తారాగణంలో బెంజమిన్ గిలానీ, సుహాసిని ములే, మోనా అంబేగావ్కర్, లీలా శాంసన్, బగ్స్ భార్గవ, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వక్వార్ షేక్, ఫణి సహా అనేక ఇతర బాల నటులు ఉన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
యామిని ఫిల్మ్స్ హైదరాబాద్ సమర్పణలో, ఈ బహుభాషా చిత్రం హిందీ, తెలుగులో చిత్రీకరించబడింది. తమిళంలో డబ్ చేయబడింది. ఇది మే 12 , 2023న PVR ద్వారా హిందీ, తమిళం, తెలుగులో దిల్ రాజు సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:Agent: ఏజెంట్’ బుకింగ్స్ ఓపెన్.. సెన్సార్ టాక్ ఏంటి!?