ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పై హరీష్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పని అయిపోయింది అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. తాజాగా… పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని హరీష్ రావుు అనడం విడ్డూరంగా ఉందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యింది కాబట్టే బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇస్తారని పార్టీ పేరు మార్చుకున్నది మీరు అని పేర్కొన్న ఆయన పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకుండా బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు..మీ బామ్మర్ది మంత్రులు అయ్యేవాళ్ళా ..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పని అయిపోయింది అని హరీష్ రావు చెప్పడం కాదు … ప్రజలు టీఆర్ఎస్ పని పట్టే పనిలో ఉన్నారని అన్నారు. ఇక ఈ నెల 20, 21, 22లో పార్టీ ఇంచార్జ్ వస్తున్నారని హాత్ సే హాత్ జోడో యాత్ర, పార్టీ బలోపేతం మీద చర్చిస్తారని అన్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ తప్పుల తడకగా ఉందని పేర్కొన్న మహేష్ గౌడ్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కుట్ర చేస్తున్నారని అన్నారు.