»High Temperatures Are Likely To Be Recorded In Ap For The Next Three Days
Temperature: ఏపీలో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు.. అవసరమైతే తప్ప బయటకు రాకండి
వేసవి(Summer)లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7గంటల నుంచే సుర్రుమంటున్నాడు. 9దాటితే బయట అడుగు వేస్తే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు.
Temperature: వేసవి(Summer)లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7గంటల నుంచే సుర్రుమంటున్నాడు. 9దాటితే బయట అడుగు వేస్తే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ చాలా వరకు దూరంగానే ఉంటున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు(high Temperature) నమోదవుతాయని వాతావారణ శాఖ(IMD) హెచ్చరించింది. 302 మండలాల్లో ఈ ప్రభావం ఉందని చెప్పారు.
ఏపీలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(Andhra Pradesh State Disaster Management Authority) ప్రకటించింది. ఈరోజు కోనసీమ(konaseema) జిల్లా పామర్రు మండలంలో తీవ్ర వడగళ్ల వాన కురుస్తోందని, 286 మండలాల్లో వడగళ్ల వాన కురిసిందని వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C – 46°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వివరించింది.
రేపు పలు జిల్లాల్లో 45°C – 47°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రేపు 17 మండలాల్లో తీవ్ర వడగళ్ల వాన కురుస్తుందని, 300 మండలాల్లో వడగళ్ల వాన కురుస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1°C, ఏలూరు జిల్లా కమవరపుకోటలో 44°C నమోదైంది. తీవ్రమైన వేడి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.