Pareshan Movie Review: పరేషాన్ మూవీ ఫుల్ రివ్యూ..పక్కా పరేషాన్ అయితరు!
హిట్ మూవీ మసూదా ఫేమ్ తిరువీర్, హీరోయిన్ పావని కర్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పరేషాన్. ఈ మూవీ ఈరోజు(జూన్ 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించగా..రూపక్ రోనాల్డ్సన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
బ్లాక్ బస్టర్ మూవీ మసూదాలో నటించిన తిరువీర్, రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పరేషాన్. ఈ మూవీ ఈరోజు(జూన్ 2న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దగ్గుబాటి రానా ప్రమోట్ చేయడంతో అంచనాలు కూడా ప్రేక్షకుల్లో భారీగానే ఉన్నాయి. మరోవైపు దసరా, బలగం చిత్రాల తర్వాత పూర్తిగా తెలంగాణ స్లాంగ్ తో వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆసక్తి కూడా పెరిగింది. ఇంకోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ సహా మ్యూజిక్ కూడా మంచి క్రేజ్ ను పెంచేసింది. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన ఈ మూవీ స్టోరీ ఏంటీ? హిట్టా ? ఫట్టా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
హీరో ఐజాక్(తిరువీర్) తండ్రి తెలంగాణలోని ఓ సింగరేణి గనిలో చిరు ఉద్యోగి సమర్పణ్(మురళీధర్ గౌడ్). అయితే అతను ఉద్యోగం మానేసి ప్రార్థన సేవ చేసుకోవాలనేది తన కోరిక. ఆ క్రమంలో తన సింగరేణి జాబ్ కొడుకుకు ఇప్పించాలని కోరుకుంటాడు. అందుకు ఓ అధికారి కొంత డబ్బు సిద్ధం చేసుకోవాలని చెప్పగా..ఐజాక్ తండ్రి తన భార్య గాజులు అమ్మి నగదు సమకూర్చుతాడు. వాటిని ఆ అధికారికి ఇవ్వాలని ఐజాక్ ను పంపగా ఆ సమయంలో అతను ఇంట్లో ఉండడు. అదే సమయంలో ఇద్దరు దోస్తులకు నగదు అవసరం ఉండి ఆ మనీ ఇచ్చేస్తాడు. ఆ నేపథ్యంలోనే ఓ పెళ్లి భరత్‌లో హీరోయిన్ శీరిష (పావని కరణం)ను చూసి హీరో లవ్‌లో పడతాడు. ఆ క్రమంలో వారిద్దరూ ఓసారి శారీరకంగా కలిసిన తర్వాత ఆమెకు వాంతులు అవుతాయి. దీంతో హీరోయిన్ ఆందోళన చెందుతుంది. మరోవైపు డబ్బుల విషయం తెలిసిన తండ్రి ఐజాక్ ను కొడతాడు. ఇలాంటి నేపథ్యంలో హీరో ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అతని దోస్తులు మళ్లీ డబ్బు తిరిగి ఇచ్చారా లేదా? అసలు చివరికి ఏమైంది? సింగరేణి జాబ్ వచ్చిందా రాలేదా అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని నలుగురు దోస్తులు, వారి మధ్య మొదలైన లవ్ స్టోరీలు, పైసల లొల్లి, తాగుడు అనే అంశాలతో కొనసాగుతుంది. అయితే ఈ సినిమాకు పరేషాన్ అనే టైటిల్ పక్కా సూటైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో క్యారెక్టర్లు కూడా అలాగే ఉంటాయి. స్టోరీ కూడా పాతదే. ఖాళీగా తిరిగే కొడుకుకు ఉద్యోగం పెట్టించాలని తండ్రి భావిస్తాడు. ఆ క్రమంలో ఓ అమ్మాయితో లవ్. దోస్తులకు క్యాష్ ఇస్తే వారు తెచ్చిన ఇబ్బందులను చూపించారు. క్రైస్తవ మతం గురించి కొన్ని సీన్లు ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు బాగుంటాయి. ఇక సెకండాఫ్ లో స్టోరీకి కంక్లూషన్ ఇవ్వడంలో డైరెక్టర్ తడబడ్డాడనే చెప్పవచ్చు. అనేక చోట్ల కథలో ఎమోషన్ కనిపించదు. మరోవైపు తాగుడు సీన్లు కూడా ఎక్కువైనయని అనిపిస్తుంది. మొత్తంగా పరేషాన్ కావాలంటే ఓసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.
సాంకేతిక విభాగాలు
రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన పరేషాన్ హాస్యభరిత చిత్రం. కానీ దర్శకుడు పాత కథనంతో ఎగ్జిక్యూట్ చేయడంతోపాటు న్యారెట్ చేయడంలో కూడా విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఎక్కువైన తాగుడు సీన్లు, తగ్గిన కామెడీతో పరేషాన్ చేశాడు. యశ్వంత్ నాగ్ సంగీతం పర్వాలేదు. కొన్ని చోట్ల సీన్లకు సపోర్ట్ చేశాడు. వాసు పెండెం సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మరోసారి చూసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఎవరెలా చేశారు
ఈ చిత్రంలో హీరోగా తిరువీర్ తన బెస్ట్ ఇచ్చాడు. దోస్తులు డబ్బులు తిరిగి ఇవ్వనప్పుడు సహా పలు సీన్లలో మెప్పించాడు. ఇక హీరోయిన్ పావని కరణం కూడా తన పాత్రలో లీనమై యాక్ట్ చేసింది. తనకు ఏదో అయిందని ఆవేదన చెందే సన్నీవేశాలతోపాటు ఇంకొన్ని సీన్లలో సహజంగా కనిపించింది. ఇక మిగతా నటీనటులు బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల వారి క్యారెక్టర్ల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
+హీరో, హీరోయిన్ యాక్టింగ్
+మ్యూజిక్
+నిర్మాణ విలువలు